కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన సూర్యకుమార్‌, పృథ్వీ షా

18 Aug, 2021 14:07 IST|Sakshi

లండన్‌: టీమిండియా యువ ఆటగాళ్లు సూర్యకుమార్‌​ యాదవ్‌, పృథ్వీ షాలు మిమిక్రీతో అదరగొట్టారు. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపికయిన శుబ్‌మన్‌ గిల్‌,   వాషింగ్టన్‌ సుందర్‌, ఆవేశ్‌ ఖాన్‌లు గాయాల బారీన పడి స్వదేశానికి వెళ్లిపోయారు. వారి స్థానంలో సూర్యకుమార్‌, పృథ్వీ షాలు ఎంపిక చేశారు.  శ్రీలంక పర్యటన ముగించుకొని నేరుగా ఇంగ్లండ్‌కు వచ్చిన వీరిద్దరు క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఇటీవలే క్వారంటైన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సూర్య, పృథ్వీలు జట్టుతో కలిశారు. లార్డ్స్‌ టెస్టులో ఘన విజయం అందుకున్న టీమిండియాతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

ఆగస్టు 25 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు సిద్ధమవుతున్న వీరు తాజాగా ఒక మిమిక్రీ వీడియోతో మెప్పించారు. బాజీగర్‌ సినిమాలోని జానీ లీవర్‌, దినేష్‌ హింగూల క్యారెక్టర్లను ఇమిటేట్‌ చేసిన  సూర్య, పృథ్వీలు మంచి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. సూర్య తన చేతిలో కాఫీ కప్‌ పట్టుకొని ఉండగా.. అతని వెనుకాల పృథ్వీ షా కూర్చొని ఉన్నాడు. సూర్య చేతిలో పట్టుకున్న కప్పును పృథ్వీకి చూపిస్తూ వెటకారంగా నవ్వాడు.. దీనికి పృథ్వీ కూడా అలాగే చేశాడు. ''హమ్‌ పాగల్‌ నహీ హై.. హమారా దిమాక్‌ కరాబ్‌ హై'' అంటూ క్యాప్షన్‌ జత చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మూడో టెస్టుకు సిద్ధమవుతుంది. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆగస్టు 25 నుంచి లీడ్స్‌ వేదికగా జరగనుంది. 

A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar)

మరిన్ని వార్తలు