Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్‌.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ

3 Aug, 2022 11:22 IST|Sakshi

వెస్టిండీస్‌ సిరీస్‌కు రెగ్యులర్‌ ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో టీమిండియా ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి విజృంభించాడు. మంగళవారం రాత్రి జరిగిన మూడో టి20లో సూర్యకుమార్‌ కీలక అర్థ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా సూర్యకుమార్‌ 44 బంతుల్లో  8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. విండీస్‌ గడ్డపై ఒక టీమిండియా బ్యాటర్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

తద్వారా కరేబియన్‌ గడ్డపై టీమిండియా తరపున రిషబ్‌ పంత్‌ పేరిట ఉన్న రికార్డును సూర్యకుమార్‌ బద్దలు కొట్టాడు. అయితే తొలి రెండు టి20ల్లో ఓపెనర్‌గా ఘోరంగా విఫలం కావడంతో సూర్య ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. అయితే వాటిన్నింటికి అతను తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఇదంతా సూర్య ఇంటికి కొత్త లగ్జరీ కారు వచ్చిన వేళా విశేషమే అంటున్నారు క్రికెట్‌ ఫ్యాన్స్‌. అవునండీ మన సూర్య ఇంటికి కొత్త ఎస్‌యూవీ లగ్జరీ కారు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని సూర్యకుమార్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. ''రెడీ ఫర్‌ డెలివరీ టాప్‌జాబ్‌ బడ్డీ'' అని క్యాప్షన్‌ కనిపిస్తుంది. 

కాగా టీమిండియా, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ సూర్యకుమార్‌ ఏడాదికి రూ.20 కోట్ల పైనే అర్జిస్తున్నాడు. సూర్య ఇంట్లో ఇప్పటికే చాలా కార్లు కలెక్షన్‌గా కలిగి ఉన్నాడు. బీఎండబ్ల్యూఈ 5 సిరీస్‌, ఆడీ ఏ6, రేంజ్‌ రోవర్‌, హుండాయ్‌ ఐ20, ఫార్చూనర్‌లు ఉన్నాయి. తాజాగా ఎస్‌యూవీ లగ్జరీ కారు కొత్తగా వచ్చి చేరనుంది. కార్లతో పాటు సుజుకీ హయాబుసా, హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌లు కలిగి ఉన్నాడు సూర్యకుమార్‌. ఇక సూర్యకుమార్‌ టీమిండియా తరపున 13 మ్యాచ్‌ల్లో 340 పరుగులు.. 20 టి20ల్లో 561 పరుగులు సాధించాడు.

చదవండి: రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ హర్ట్‌.. బీసీసీఐ కీలక అప్‌డేట్‌.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్‌

 సూర్యకుమార్‌ మెరుపులు.. మూడో టి20లో భారత్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు