కోహ్లిపై అభిప్రాయాన్ని వెల్లడించిన సూర్యకుమార్‌

23 May, 2021 20:08 IST|Sakshi

ముంబై: ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో "ఆస్క్‌ మీ ఎనీ థింగ్‌" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను సింగల్‌ వర్డ్‌లో సమాధానమిచ్చాడు. సచిన్‌ గురించి అభిమానులు అడగ్గా.. క్రికెట్‌ దేవుడని, ధోనిని దిగ్గజ క్రికెటర్‌ అని, కోహ్లి అంటే ఇన్‌స్పిరేషన్‌(స్పూర్తి) అని, రోహిత్‌ శర్మ అంటే హిట్‌మ్యాన్‌ అని, పోలార్డ్‌ అంటే లార్డ్‌ అని, హార్దిక్‌ పాండ్య అంటే ఎంటర్‌టైనర్ అని టకాటకా బదులిచ్చాడు. 

ఇక క్రికెటే తన ఊపిరని, అందులో తనకిష్టమైన షాట్ స్వీప్‌షాట్‌ అని చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టును అతను కుటుంబంతో పోల్చాడు. క్రికెటర్‌ కాకపోయుంటే ఏమైవుండేవాడివని ఓ అభిమాన్ని అడిగిన ప్రశ్నకు.. నటుడిగా రాణించేవాడినని సమాధానమిచ్చాడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలే కాకుండా, అభిమానులడిన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సూర్యకుమార్ ఓపికగా సమాధానమిచ్చాడు. బిర్యాని తనకిష్టమైన ఆహారమని, బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఫేవరెట్‌ తన యాక్టర్‌ అని వెల్లడించాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా.. సూర్యకుమార్‌, కోహ్లిల మధ్య మైదానంలో జరిగిన ఘర్షన నేపథ్యంలో కోహ్లిని స్పూర్తిదాయకమైన ఆటగాడని పేర్కొనడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
చదవండి: 45 ఏళ్ల వయసులో ఇరగదీశాడు.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు

మరిన్ని వార్తలు