IPL 2022: ఒకప్పుడు నెట్‌ బౌలర్‌గా.. ఇప్పుడు ఏకంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో..!

5 May, 2022 08:16 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీడియం పేసర్‌ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్‌-2022 సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో జార్ఖండ్ లెఫ్టార్మ్ పేసర్ సుశాంత్ మిశ్రాను సన్‌రైజర్స్ భర్తీ చేసింది. సుశాంత్ మిశ్రా 2020 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యడిగా ఉన్నాడు. ఈ టోర్నమెంట్‌లో మిశ్రా ఏడు వికెట్లు పడగొట్టాడు. మరో వైపు దేశీవాళీ క్రికెట్‌లో  నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుశాంత్ 13 వికెట్లు సాధించాడు.

ఇక 2020 నుంచి 2021 ఐపీఎల్‌ సీజన్ వరకు  ఆర్‌సీబీ నెట్‌ బౌలర్‌గా సుశాంత్ మిశ్రా ఉన్నాడు. కాగా రూ.20 లక్షలకు సుశాంత్ మిశ్రాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం(మే5) తలపడనుంది.

చదవండి: Diego Maradona: మారడోనా హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ జెర్సీకి కళ్లు చెదిరే మొత్తం 

మరిన్ని వార్తలు