మయామి ఓపెన్‌ చాంపియన్‌ స్వియాటెక్‌

4 Apr, 2022 06:12 IST|Sakshi

పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ స్వియాటెక్‌ మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోర్నీ ఫైనల్లో 6–4, 6–0తో మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌)పై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో స్వియాటెక్‌కిది వరుసగా మూడో ప్రీమియర్‌ టైటిల్‌ (ఖతర్‌ ఓపెన్, ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్, మయామి ఓపెన్‌) కావడం విశేషం. సెరెనా (అమెరికా–2013లో), వొజ్నియాకి (డెన్మార్క్‌–2010లో) తర్వాత ఒకే సీజన్‌లో వరుసగా మూడు డబ్ల్యూటీఏ–1000 టైటిల్స్‌ నెగ్గిన మూడో ప్లేయర్‌గా స్వియాటెక్‌ గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు