Swiss Open: ఫైనల్లో సింధు

27 Mar, 2022 05:01 IST|Sakshi

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 79 నిమిషాల్లో 21–18, 15–21, 21–19తో సుపనిద కటెథోంగ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు ఆడుతుంది. గత ఏడాది ఫైనల్లో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడి సింధు రన్నరప్‌గా నిలిచింది.

పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ (భారత్‌) ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి సెమీఫైనల్లో ప్రణయ్‌ 21–19, 19–21, 21–18తో ఐదో ర్యాంకర్‌ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)పై గెలిచాడు. రెండో సెమీఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌ (భారత్‌) 21–18, 7–21, 13–21తో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.

మరిన్ని వార్తలు