ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌: నటరాజన్‌ డౌటే!

10 Mar, 2021 11:21 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ టి. నటరాజన్ శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న 5 టీ20 సిరీస్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ వేదికగానే జరగనున్నాయి. భుజం గాయంతో బాధపడుతున్న నటరాజన్‌ ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో(ఎన్‌సీఏ) ఉన్నాడు. అతని ఫిట్‌నెస్‌ను పరిక్షించి టీ20ల్లో ఆడించాలా వద్దా అనేది మార్చి 12న తేలనుంది. అందుకే నటరాజన్‌ తొలి టీ20 ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎన్‌సీఏ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. కాగా నటరాజన్‌తో పాటు వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ తెవాటియాలు కూడా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రాహుల్‌ తెవాటియా, వరుణ్‌ చక్రవర్తిలు ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైనట్లు సమాచారం.

అయితే మార్చి 12లోపు ఒకవేళ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ అయితే తొలి టీ20లో ఆడే చాన్స్‌ ఉందంటూ తెలిపింది. ఒకవేళ రిపోర్ట్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలితే మాత్రం  నటరాజన్‌ పూర్తిగా దూరమవ్వనున్నాడు. ఇక నెట్‌బౌలర్‌గా వెళ్లి, ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన నట్టూ భాయ్‌.. ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీసి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. 
చదవండి:
అందమైన బహుమతి.. థాంక్యూ లడ్డూ: నటరాజన్‌

యువీని ఉతికారేసిన కెవిన్‌ పీటర్సన్‌.. 

మరిన్ని వార్తలు