IPL 2022: 'నటరాజన్‌ గాయం నుంచి కోలుకున్నాక తన ఫామ్‌ను కోల్పోయాడు'

22 May, 2022 16:57 IST|Sakshi

ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభంలో అద్భుతంగా రాణించిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ టి. నటరాజన్‌.. టోర్నీ సెకెండ్‌ హాఫ్‌లో నిరాశపరిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన గత కొన్ని మ్యాచ్‌లలో నట్టు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో నటరాజన్ భారత ‍మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్నాక నటరాజన్ అంతగా రాణించలేకపోతున్నాడని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు నటరాజన్ దూరమయ్యాడు. మే 14న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి నటరాజన్‌ వచ్చాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన చివరి మ్యాచ్‌లో ముంబైపై 4 ఓవర్లలో ఏకంగా నటరాజన్‌ 60 పరుగులు ఇచ్చాడు. ఈ ఏడాది సీజన్‌లో తమ అఖరి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.

"నటరాజన్ గాయం నుంచి కోలుకున్నాక తన బౌలింగ్‌లో కొంత రిథమ్‌ను కోల్పోయాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన చివరి మ్యాచ్‌లో యార్కర్లను వేయడానికి అతడు చాలా కష్టపడ్డాడు. యార్కర్లు వేయడానికి ప్రయత్నించి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఈ టోర్నీలో బాగా రాణించాడు. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడని భావిస్తున్నాను. ఇక ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా అద్భుతమైన ఫాస్ట్‌ బౌలర్‌. అయితే అతడు తన నాలుగు ఓవర్లలో 40 పరుగులైనా ఇవ్వవచ్చు లేదా మూడు వికెట్లు అయినా తీయవచ్చు అని"  ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది  సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 11 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: Ind Vs Eng: అదరగొడుతున్నాడు.. అతడిని ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయండి: గావస్కర్‌

>
మరిన్ని వార్తలు