T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా

24 Nov, 2021 16:48 IST|Sakshi

T.Natarajan Ruled Out Of Vijay Hazare Trophy Due To Knee Injury.. తమిళనాడు ఫాస్ట్‌ బౌలర్‌ టి. నటరాజన్‌ అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా కనిపిస్తున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి గాయాల బెడద అతన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా మోకాలి గాయం మరోసారి తిరగబెట్టడంతో  దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోఫీ కి నటరాజన్‌ దూరమయ్యాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో సభ్యుడిగా ఉన్న నటరాజన్‌ క్వార్టర్ ఫైనల్‌, సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నప్పటికి..  ఫైనల్‌లో ఆడాడు. తమిళనాడు టైటిల్‌ గెలిచిన అనంతరం అతను చేసిన డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. '' మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టడంతో టోర్నీకి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నటరాజన్‌ రీహాబిటేషన్‌ కోసం ఎన్‌సీఏ అకాడమీకి వెళ్లనున్నాడు.

చదవండి: Dinesh Karthik: మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్

ఇక తమిళనాడు పేసర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన నటరాజన్‌.. 2020-21 ఆసీస్‌ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న నట్టూ ఆసీస్‌ గడ్డపై  అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. ఇక నట్టూ తనదైన  ప్రదర్శనతో మెప్పించాడు. యార్కర్‌ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అతను స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కీలకమవుతాడని భావించారు. ఇంగ్లండ్‌తో తొలివన్డే ఆడిన తర్వాత  మొకాలి గాయం నటరాజన్‌ను టీమిండియాకు దూరం చేసింది. అంతే అప్పటినుంచి నటరాజన్‌ మళ్లీ టీమిండియాకు ఆడలేకపోయాడు.

మోకాలి సర్జరీ అనంతరం మళ్లీ మైదానంలో అడుగుపెట్టినప్పటికీ గాయాల బెడద మాత్రం వీడలేదు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ తొలి అంచె పోటీలకు దూరంగా ఉన్న నట్టూ ఆ తర్వాత రెండో అంచె పోటీల్లోనే పెద్దగా ఆడలేకపోయాడు. అలా ఒక టోర్నీలో ఆడాడో లేదో మళ్లీ గాయపడడం అతని అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. 

చదవండి: ICC T20 Rankings: విరాట్‌ కోహ్లి ఔట్‌.. కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే

మరిన్ని వార్తలు