'రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నా'

16 May, 2021 18:11 IST|Sakshi

చెన్నై: యార్కర్ల స్పెషలిస్ట్‌.. టీమిండియా ఆటగాడు టి. నటరాజన్‌ మోకాలు గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభంలోనే నట్టూకు గాయం తిరగబెట్టడంతో లీగ్‌కు దూరమయ్యాడు. వైద్యుల అతన్ని పరీక్షించి మోకాలికి సర్జరీ నిర్వహించారు. తాజాగా ఇంట్లోనే ఉంటున్న నట్టూ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.  ''నేను రోజురోజుకీ ధృఢంగా తయారవుతున్నానంటూ'' క్యాప్షన్‌ జత చేశాడు. ఈ సందర్భంగా రీహాబ్‌, ప్రొగ్రెస్‌ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.

''22 యార్డులున్న పిచ్‌పై బౌలింగ్‌ చేయడానికి త్వరలోనే వస్తా. ఇప్పుడు నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. మోకాలి సర్జరీ విజయవంతం అయింది. మీ  ఆశీర్వాద బలంతో త్వరగా కోలుకుంటున్నా. మీరు నాపై చూపిస్తున్న ఆభిమానానికి, ఆదరణకు.. అలాగే కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో నటరాజన్‌ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఆఖరి టెస్టు మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన నటరాజన్‌ మొత్తంగా ఆసీస్‌ పర్యటనలో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఆసీస్‌ పర్యటనలో గాయపడిన నటరాజన్‌ ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్‌ ప్రారంభమయ్యే సమయానికి కోలుకున్నట్లే కనిపించినా ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున రెండు మ్యాచ్‌లు ఆడిన అనంతరం మళ్లీ గాయం తిరగబెట్టడంతో లీగ్‌కు దూరమయ్యాడు.
చదవండి: నటరాజన్‌కు సర్జరీ.. బీసీసీఐ స్పందన

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు