న్యూజిలాండ్‌దే టి20 సిరీస్‌

21 Dec, 2020 02:52 IST|Sakshi

రెండో టి20లోనూ పాక్‌ ఓటమి

హఫీజ్‌ (99 నాటౌట్‌) శ్రమ వృథా  

హామిల్టన్‌: బ్యాట్స్‌మెన్‌ టిమ్‌ సీఫెర్ట్‌ (63 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్‌ కేన్‌ విలియమ్సన్‌ (42 బంతుల్లో 57 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధసెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కివీస్‌ 2–0తో గెలుచుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది.

మొహమ్మద్‌ హఫీజ్‌ (57 బంతుల్లో 99 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. హఫీజ్‌ ఒంటరి పోరాటం చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ టిమ్‌ సౌతీ 4 వికెట్లతో చెలరేగాడు. జేమ్స్‌ నీషమ్, ఇష్‌ సోధి చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం న్యూజిలాండ్‌ 19.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 164 పరుగులు చేసి గెలుపొందింది. గప్టిల్‌ (11 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. సీఫెర్ట్, విలియమ్సన్‌ రెండో వికెట్‌కు అజేయంగా 95 బంతుల్లో 124 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అష్రఫ్‌కు ఒక వికెట్‌ దక్కింది. నామమాత్రమైన మూడో టి20 మంగళవారం జరుగుతుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు