T20 WC 2021: నా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌.. అతడే అత్యుత్తమ బౌలర్‌.. టీమిండియా ఆటగాళ్లకు నో ఛాన్స్‌!

16 Nov, 2021 13:18 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ 2021 బెస్ట్‌ ప్లేయింగ్‌ జట్టును ప్రకటించిన ఆకాశ్‌ చోప్రా

T20 World Cup 2021 Aakash Chopra Picks His Best Playing Xi of the Tournament, No Chance Indian Players: టీ20 ప్రపంచకప్‌-2021లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓటమితో ప్రయాణాన్ని ప్రారంభించిన టీమిండియా కనీసం సెమీస్‌ కూడా చేరకుండా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కీలక పోరులో కోహ్లి సేనను ఓడించి... న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరగా.. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా మాత్రం.. అఫ్గనిస్తాన్‌, స్కాట్లాండ్‌, నమీబియా వంటి జట్లపై విజయాలతో సరిపెట్టుకుని రిక్తహస్తాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత బ్యాటర్లు, బౌలర్లు ఈ మెగా టోర్నీలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించిన ఐసీసీ.. వీరిలో ఒక్క టీమిండియా ప్లేయర్‌కు కూడా అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే. ఇక భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా సైతం తన జట్టులో ఒక్కరంటే ఒక్క టీమిండియా ఆటగాడికి కూడా ఛాన్స్‌ ఇవ్వలేదు. సూపర్‌ 12 రౌండ్‌లో ఐదింటికి ఐదు గెలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న ఆకాశ్‌ చోప్రా.. అతడు మూడోస్థానంలో మెరుగ్గా ఆడగలడని పేర్కొన్నాడు.

ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఓపెనర్‌గా ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జోస్‌ బట్లర్‌, మరో ఓపెనర్‌గా చాంపియన్‌ ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ పేరును ప్రకటించాడు. అదే విధంగా శ్రీలంక సంచలనం చరిత్‌ అసలంకకు నాలుగో స్థానంలో చోటిచ్చాడు. మొయిన్‌ అలీ, డేవిడ్‌ వీజ్‌ను ఆల్‌రౌండర్లుగా ఎంచుకున్నాడు. ఇక తన జట్టులో నలుగురు బౌలర్లకు చోటిచ్చిన ఆకాశ్‌ చోప్రా.. ఆడం జంపాను ఈ టోర్నీలో అత్యుత్తమ లెగ్‌ స్పిన్నర్‌గా అభివర్ణించాడు. 

ఆకాశ్‌ చోప్రా బెస్ట్‌ టీ20 వరల్డ్‌కప్‌ ప్లేయింగ్‌ జట్టు ఇదే

జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌- ఇంగ్లండ్‌), డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా), బాబర్‌ ఆజమ్‌(కెప్టెన్‌- పాకిస్తాన్‌), చరిత్‌ అసలంక(శ్రీలంక), ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా), మొయిన్‌ అలీ(ఇంగ్లండ్‌), డేవిడ్‌ వీజ్‌(నమీబియా), ఆడం జంపా(ఆస్ట్రేలియా), ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా), అన్రిచ్‌ నోర్ట్జే(దక్షిణాఫ్రికా).

చదవండి: IND vs NZ T20I Series 2021: భారత్‌తో టీ20 సిరీస్‌ ముందు కివీస్‌కు షాక్‌.. తప్పుకొన్న విలియమ్సన్‌.. ఎందుకంటే..


 

మరిన్ని వార్తలు