Geoff Marsh- Mitchell Marsh: ముగ్గురూ క్రికెటర్లే.. 34 ఏళ్ల క్రితం అద్భుతం చేసిన తండ్రి.. ఇప్పుడు కొడుకు కూడా

15 Nov, 2021 09:04 IST|Sakshi

T20 World Cup 2021 Final: Mitchell Marsh Repeats His Father's Geoff Marsh World Cup Winner 34 Years Record: ఆస్ట్రేలియాకు తీరని కలగా ఉన్న టీ20 ప్రపంచకప్‌ ఎట్టకేలకు కంగూరూల సొంతమైంది. నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మొదటిసారి టైటిల్‌ను గెలిచింది. ఐదు సిరీస్‌ పరాజయాల నుంచి చాంపియన్‌గా నిలిచి ఆరోన్‌ ఫించ్‌ తమ సత్తా ఏమిటో నిరూపించుకుంది. ముఖ్యంగా ఫైనల్‌లో స్టార్‌ ఓపెపర్‌ డేవిడ్‌ వార్నర్‌ (53 పరుగులు), మిచెల్‌ మార్ష్‌(77) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

34 ఏళ్ల క్రితం తండ్రి..
ప్రధానంగా  మార్ష్‌ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆసీస్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, 34 ఏళ్ల క్రితం మార్ష్‌ తండ్రి జెఫ్‌ మార్ష్‌ కూడా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తొలిసారిగా విజేతగా నిలవడంలో కీలకంగా వ్యహరించాడు. ప్రపంచకప్‌-1987 టోర్నీలో మొత్తంగా 428 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాదు... రిటైర్‌మెంట్‌ తర్వాత ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌గా మారిన జెఫ్‌ మార్ష్‌... ఆసీస్‌ 1999లో తమ రెండో టైటిల్‌ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

తండ్రిలాగే కొడుకు
తండ్రి జెఫ్‌ మార్ష్‌ అడుగుజాడల్లోనే నడిచాడు మిచెల్‌ మార్ష్‌(mitchell marsh). గత ఆరు పర్యాయాలుగా అందని ద్రాక్షగా ఆసీస్‌ను ఊరిస్తున్న టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో మార్ష్‌ మొత్తంగా.. ఐదు ఇన్నింగ్స్‌లో మార్ష్‌ 185 పరుగులతో రాణించాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక జెఫ్‌ మార్ష్‌ మరో తనయుడు, మిచెల్‌ మార్ష్‌ సోదరుడు షాన్‌ మార్ష్‌ సైతం క్రికెటర్‌ అన్న సంగతి తెలిసిందే. ఇలా కుటుంబమంతా ఆసీస్‌ జట్టులో చోటు సంపాదించడమే కాకుండా పలు కీలక సమయాల్లో విజయాలు అందించడం విశేషం.

చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్‌.. ఇతర జట్ల ప్రైజ్‌ మనీ ఎంతంటే..

మరిన్ని వార్తలు