T20 WC 2021: పాక్ విజయంపై ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు

26 Oct, 2021 18:00 IST|Sakshi

Pak PM Imran Khan Reaction After Pak Defeat Team India In T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌-2021లో టీమిండియాపై దాయాది పాక్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తొలిసారి స్పందించాడు. సోమవారం రియాద్‌లో విలేకరులు ఆడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. భారత్‌పై పాక్‌ విజయం చారిత్రకమైందిగా అభివర్ణించాడు. ఇస్లామాబాద్ ఢిల్లీతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటుందని, పాక్‌ గెలుపుపై స్పందించేందుకు ఇది సమయం కాదని మాట దాటవేశాడు. భారత్‌తో క్రికెట్‌ సంబంధాలు భవిష్యత్తులో మరింత మెరుగుపడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, టీమిండియాపై విజయం అనంతరం పాక్‌ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే, టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్‌ అజమ్‌(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్‌ రిజ్వాన్‌( 79 పరుగులు, 55 బంతులు;  6 ఫోర్లు, 3 సిక్సర్లు)లు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 152 పరుగులు జోడించి పాక్‌కు చారిత్రక విజయాన్ని అందించారు.
చదవండి: విండీస్‌ బ్యాటర్‌ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..!
 

మరిన్ని వార్తలు