T20 WC Final: వావ్‌.. మిచెల్‌ మార్ష్‌ అరుదైన రికార్డు.. కేన్‌ మామ, వార్నర్‌ భాయ్‌ కూడా!

14 Nov, 2021 23:42 IST|Sakshi

T20 WC 2021 Winner Australia: Mitchell Marsh Kane Williamson Warner Rare Record In Final: టీ20 వరల్డ్‌కప్‌ కొత్త చాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి సారి పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ ట్రోఫీ-2021 కైవసం చేసుకుని సత్తా చాటింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్‌ మార్ష్‌(50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి టైటిల్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.  

మార్ష్‌ తక్కువ బంతుల్లోనే..
ఇక నవంబరు 14 నాటి ప్రపంచకప్‌ ఫైనల్‌ సందర్భంగా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, ఆసీస్‌ ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించారు. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 

మార్ష్‌ 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. విలియమ్సన్‌ 32 బంతులు, వార్నర్‌ 34 బంతుల్లో ఈ రికార్డు సాధించారు. అంతకుముందు 2014లో ఇండియాతో ఫైనల్‌లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(33), 2016లో వెస్టిండీస్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌(33) ఈ ఘనత అందుకున్నారు. ఇక ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్ష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: అంచనాలు లేకుండా బరిలోకి.. స్విచ్‌హిట్‌తో మ్యాక్సీ విన్నింగ్‌ షాట్‌

మరిన్ని వార్తలు