1st Semi Final NZ Vs Pak: కివీస్‌ను చిత్తు చేసి.. ఫైనల్లో పాకిస్తాన్‌

9 Nov, 2022 18:23 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Pakistan, 1st Semi-Final Updates In Telugu:
రిజ్వాన్‌, బాబర్‌ ఆజం జోరు కొనసాగుతోంది. ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి బాబర్‌ విషయంలో కివీస్‌ రివ్యూకు వెళ్లగా నిరాశే ఎదురైంది. 8 ఓవర్లు ముగిసే సరికి రిజ్వాన్‌ 32, బాబర్‌ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దంచి కొడుతున్న పాక్‌ ఓపెనర్లు
పాక్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ ఆజం దంచికొడుతున్నారు. ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. దీంతో పవర్‌ ప్లేలో పాక్‌ వికెట్‌ నష్టపోకుండా 55 పరుగులు చేయగలిగింది. రిజ్వాన్‌ 28, బాబర్‌ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

3 ఓవర్లలో పాక్‌ స్కోరెంతంటే!
కివీస్‌ను నామమాత్రపు స్కోరుకే కట్టడి చేసిన పాక్‌ బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం నిలకడగా ఆడుతున్నారు. 3 ఓవర్లలో పాక్‌ స్కోరు: 24-0

పాక్‌తో తొలి సెమీ ఫైనల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో డారిల్‌ మిచెల్‌(53- నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 46 పరుగులతో రాణించాడు. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ ఆఫ్రిదికి రెండు, మహ్మద్‌ నవాజ్‌కు ఒక వికెట్‌ దక్కాయి. 

డారిల్‌ మిచెల్‌ అర్థ శతకం
►ఎట్టకేలకు కివీస్‌ ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ నమోదైంది. హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసిన మిచెల్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 144-4(19 ఓవర్లలో)

►డారిల్‌ మిచెల్‌ హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 133-4 కాగా.. మిచెల్‌ 46 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

నాలుగో వికెట్‌ డౌన్‌
కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ రూపంలో కివీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 17 వ ఓవర్‌ రెండో బంతికి షాహిన్‌ ఆఫ్రిది కివీస్‌ సారథిని బౌల్డ్‌ చేశాడు. దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్‌ నిష్క్రమించాడు. నీషమ్‌, మిచెల్‌ క్రీజులో ఉన్నారు.

►అర్థ శతకానికి చేరువలో కేన్‌ మామ!
15 ఓవర్లు ముగిసే సరికి విలియమ్సన్‌ 43, మిచెల్‌ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు
►మిచెల్‌, విలియమ్సన్‌ ఆచితూచి ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి విలియమ్సన్‌ 35, మిచెల్‌ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.
►11 ఓవర్లలో కివీస్‌ స్కోరు: 73-3
►10 ఓవర్లలో కివీస్‌ స్కోరు: 59/3.. విలియమ్సన్‌, మిచెల్‌ బ్యాటింగ్‌

మూడు వికెట్లు డౌన్‌
►గ్లెన్‌ ఫిలిప్స్‌ను అవుట్‌ చేసిన నవాజ్‌
►ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి కివీస్‌ ఓపెనర్‌ కాన్వే రనౌట్‌ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌ రెండో వికె​ట్‌ కోల్పోయింది. పవర్‌ ప్లేలో న్యూజిలాండ్‌ స్కోరు:  38/2
►5 ఓవర్లలో కివీస్‌ స్కోరు: 30/1. కాన్వే, విలియమ్సన్‌ బ్యాటింగ్‌

తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఫిన్‌ అలెన్‌ (4) ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. 

  • పాక్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

తుది జట్లు:
న్యూజిలాండ్‌
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్‌ కీపర్‌), కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

పాకిస్థాన్‌:
మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

సై అంటే సై
టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు తెర లేచింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌- పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో ఇరు జట్లు బుధవారం(నవంబరు 9) అమీ తుమీ తేల్చుకోనేందుకు సిద్ధమయ్యాయి. గతేడాది రన్నరప్‌ కివీస్‌ ఈసారి టైటిల్‌ వేటే లక్ష్యంగా ముందుకు సాగుతుండగా.. సెమీస్‌ గండం గట్టెక్కి తుది మెట్టుకు చేరుకోవాలని పాక్‌ ఉవ్విళ్లూరుతోంది.

మరిన్ని వార్తలు