WC 2022 Final Pak Vs Eng Live Updates: పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ గెలిచిన ఇంగ్లండ్‌

13 Nov, 2022 17:46 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England Updates In Telugu: ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్‌  విశ్వవిజేతగా నిలిచింది. 

ఐదో వికెట్‌ డౌన్‌
18.2: మొయిన్‌ అలీ బౌల్డ్‌ 

విజయానికి చేరువలో ఇంగ్లండ్‌

16 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 110/4
►విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు కావాలి.

కట్టడి చేస్తున్న పాక్‌ బౌలర్లు
►11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో 3, 13వ ఓవర్లో 5, 14వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌

నాలుగో వికెట్‌ డౌన్‌
12.3: షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఆఫ్రిదికి క్యాచ్‌ ఇచ్చి హ్యారీ బ్రూక్‌ (20) అవుట్‌

12 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు- 82/3
10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 77/3
►విజయం కోసం 60 బంతుల్లో 61 పరుగులు కావాలి.

ఆచితూచి ఆడుతున్న స్టోక్స్‌, బ్రూక్‌
►స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి పవర్‌ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. ఇంగ్లండ్‌ బ్యాటర్లు స్టోక్స్‌(11), బ్రూక్‌(12) ఆచితూచి ఆడుతున్నారు. 9 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 69-3

పవర్‌ ప్లేలో ఇంగ్లండ్‌ స్కోరు:  49-3
హ్యారీ బ్రూక్‌ 4, బెన్‌ స్టోక్స్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో ఇప్పటి వరకు షాహీన్‌ ఆఫ్రిదికి ఒక వికెట్‌, హ్యారీస్‌ రవూఫ్‌నకు రెండు వికెట్లు దక్కాయి.

ఇంగ్లండ్‌కు భారీ షాక్‌
5.3: హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో బట్లర్‌ అవుట్‌. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్‌గా నిష్క్రమించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌. 
క్రీజులో హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌

5 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 43/2
జోస్‌ బట్లర్‌ 26, స్టోక్స్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

3.3: రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
ఫిలిప్‌ సాల్ట్‌ అవుట్‌


ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాక్‌
అలెక్స్‌ హేల్స్‌ను అవుట్‌ చేసిన షాహీన్‌ ఆఫ్రిది

ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి పాకిస్తాన్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

ఏడో వికెట్‌ డౌన్‌
18.3: సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన నవాజ్‌(5). షాహీన్‌ ఆఫ్రిది, వసీం జూనియర్‌ క్రీజులో ఉన్నారు.

షాదాబ్‌ అవుట్‌
17.2: జోర్డాన్‌ బౌలింగ్‌లో షాదాబ్‌ ఖాన్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. నవాజ్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌ క్రీజులో ఉన్నారు.

ఐదో వికెట్‌ డౌన్‌
►16.3: సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో అవుటైన షాన్‌ మసూద్‌.
►క్రీజులో మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌

15 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు:106/4 
షాదాబ్‌ ఖాన్‌ 10, షాన్‌ మసూద్‌ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ
►12.2: స్టోక్స్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగిన ఇఫ్తీకర్‌ అహ్మద్‌.
►క్రీజులో షాదాబ్‌ ఖాన్‌, షాన్‌ మసూద్‌
►12 ఓవర్లలో పాక్‌ స్కోరు: 84-3

బాబర్‌ ఆజం అవుట్‌
►11.1: ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(32). దీంతో మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌. 
►క్రీజులో షాన్‌ మసూద్‌, ఇఫ్తీకర్ అహ్మద్

10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి పాకిస్తాన్‌ స్కోరు: 68
9 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 59-2

►బాబర్‌ ఆజం 27, షాన్‌ మసూద్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌
►7.1: ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి మహ్మద్‌ హారీస్‌(8) అవుట్‌. పాక్‌ స్కోరు. 45/2

పవర్‌ ప్లేలో పాక్‌ స్కోరు
►6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 39 పరుగులు చేసిన పాక్‌.  ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కర్రన్‌కు ఒక వికెట్‌.

తొలి వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
►4.2: సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(14 బంతుల్లో 15 పరుగులు). బాబర్‌ ఆజం, మహ్మద్‌ హారీస్‌ క్రీజులో ఉన్నారు.

కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌
►4 ఓవర్లలో పాక్‌ స్కోరు:  28-0
►బాబర్‌, రిజ్వాన్‌ క్రీజులో ఉన్నారు.

తొలి ఓవర్లో పాక్‌ స్కోరు:  8-0
►0.4- రనౌట్‌ నుంచి తప్పించుకున్న మహ్మద్‌ రిజ్వాన్‌
►పాక్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ క్రీజులో ఉన్నారు.
► ఇంగ్లండ్‌ బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన బెన్‌ స్టోక్స్‌

►టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు
ఇంగ్లండ్‌
జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌/ కెప్టెన్‌), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్

పాకిస్తాన్‌
బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

నువ్వా- నేనా
టీ20 ప్రపంచకప్‌-2022 తుది పోరుకు ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ సన్నద్ధమయ్యాయి. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా ఆదివారం ఫైనల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌-1 నుంచి ఫైనల్‌కు చేరిన బట్లర్‌ బృందం.. గ్రూప్‌- 2 నుంచి తమతో పోటీకి వచ్చిన బాబర్‌ టీమ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు