T20 WC IND VS BAN: చరిత్ర సృష్టించనున్న కింగ్‌ కోహ్లి..!

2 Nov, 2022 12:48 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (నవంబర్‌ 2) జరుగునున్న కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించబోతున్నాడా..? కింగ్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అవుననే చెప్పాలి. ఇంతకీ కోహ్లి సృష్టించబోతున్న ఆ చరిత్ర ఏంటీ అంటే..? 

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇప్పటివరకు 22 ఇన్నింగ్స్‌ల్లో 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేసిన కోహ్లి.. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో మరో 16 పరుగులు చేస్తే, మెగా ఈవెంట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు ప్రస్తుతం శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే టీ20 వరల్డ్‌కప్‌ల్లో 31 మ్యాచ్‌లు ఆడి 1016 పరుగులు చేశాడు.

చదవండి: T20 WC 2022 IND VS BAN Live Updates: తొలుత బ్యాటింగ్‌ చేయనున్న టీమిండియా 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కింగ్‌ కేవలం 12 పరుగులు మాతమే చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చారిత్రక ఇన్నింగ్స్‌ (82 నాటౌట్‌) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు.

Poll
Loading...
మరిన్ని వార్తలు