T20 WC PAK VS NED: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌

30 Oct, 2022 12:28 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 30) పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. దీంతో గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి.  ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచాయి. 

తుది జట్లు..

పాకిస్తాన్‌: మహ్మద్‌ రిజ్వాన్‌, బాబార్‌ ఆజమ్‌, షాన్‌ మసూద్‌, ఫఖర్‌ జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌, షాహీన్‌ అఫ్రిది, హరీస్‌ రౌఫ్‌, నసీం షా

నెదర్లాండ్స్‌: స్టెఫాన్‌ మైబుర్గ్‌, మ్యాక్స్‌ ఓడౌడ్‌, బాస్‌ డి లీడ్‌, కొలిన్‌ అకెర్‌మన్‌, టామ్‌ కూపర్‌, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, రోల్ఫ్‌ వాన్‌ డెర్‌ మెర్వ్‌, టిమ్‌ ప్రింగిల్‌, ఫ్రెడ్‌ క్లాస్సెన్‌, బ్రాండన్‌ గ్లోవర్‌, పాల్‌ వాన్‌ మీకెరెన్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు