T20 WC 2022 PAK VS NED: సత్తా చాటిన పాక్‌ బౌలర్లు.. 91 పరుగులకే పరిమితమైన ప్రత్యర్ధి

30 Oct, 2022 14:32 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో ఇవాళ (అక్టోబర్‌ 30) పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. పాక్‌ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ 3 వికెట్లతో చెలరేగగా.. మహ్మద్‌ వసీం జూనియర్‌ 2, షాహీన్‌ అఫ్రిది, నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో కొలిన్‌ అకెర్‌మన్‌ (27), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

తుది జట్లు..

పాకిస్తాన్‌: మహ్మద్‌ రిజ్వాన్‌, బాబార్‌ ఆజమ్‌, షాన్‌ మసూద్‌, ఫఖర్‌ జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌, షాహీన్‌ అఫ్రిది, హరీస్‌ రౌఫ్‌, నసీం షా

నెదర్లాండ్స్‌: స్టెఫాన్‌ మైబుర్గ్‌, మ్యాక్స్‌ ఓడౌడ్‌, బాస్‌ డి లీడ్‌, కొలిన్‌ అకెర్‌మన్‌, టామ్‌ కూపర్‌, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, రోల్ఫ్‌ వాన్‌ డెర్‌ మెర్వ్‌, టిమ్‌ ప్రింగిల్‌, ఫ్రెడ్‌ క్లాస్సెన్‌, బ్రాండన్‌ గ్లోవర్‌, పాల్‌ వాన్‌ మీకెరెన్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు