ఆసీస్‌కు అవమానం! టాప్‌ రన్‌ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు!

7 Nov, 2022 13:03 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022- Super 12: టీ20 ప్రపంచకప్‌-2022 విజేత ఎవరో మరికొన్ని రోజుల్లో తేలనుంది. టీమిండియా- జింబాబ్వేతో సూపర్‌-12 దశకు ఆదివారం(నవంబరు 6) తెరపడిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం జట్ల తలరాతను ప్రభావితం చేసే అంశంగా పరిణమించగా.. గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-2 నుంచి భారత్‌, పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాయి.

ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు స్వదేశంలో ప్రతిష్టాత్మక టోర్నీలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సూపర్‌-12లో తమ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌- శ్రీలంకను ఓడించి ఆసీస్‌కు నిరాశను మిగిల్చింది. 

పత్తా లేని వార్నర్‌
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మరో పరాభవాన్ని కూడా ముటగట్టుకుంది. సూపర్‌-12 ముగిసే సరికి అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా కంగారూ ప్లేయర్‌ కూడా లేకపోవడం గమనార్హం. గత ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన డేవిడ్‌ వార్నర్‌ ఈ ఎడిషన్‌లో(44) అసలు పత్తానే లేకుండా పోయాడు. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడం, చిన్న జట్లు క్వాలిఫైయర్స్‌లో ఆడిన విషయాన్ని పక్కన పెడితే.. ఆసీస్‌ బౌలర్లు సైతం సొంతగడ్డపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

కోహ్లి తర్వాతి స్థానంలో అతడే
టాప్‌-10 రన్‌ స్కోరర్లలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి మొదటి స్థానంలో నిలవగా.. పసికూన నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్‌ ఒడౌడ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మిడిలార్డర్‌ స్టార్‌, టీ20 ర్యాంకింగ్స్‌ నంబర్‌ 1 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో స్థానం దక్కించుకున్నాడు.

కోహ్లి వర్సెస్‌ సూర్య
కోహ్లి, సూర్య తప్ప మిగిలిన వాళ్లంతా క్వాలిఫైయర్స్‌ ఆడిన జట్లకు చెందిన వారు కావడం విశేషం. అయితే సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో కివీస్‌ బ్యాటర్‌  గ్లెన్‌ ఫిలిప్స్‌ గనుక రేసులో నిలవకపోతే.. వీరిద్దరిలో ఎవరో ఒకరు టోర్నీ టాపర్‌గా అవతరించే అవకాశం ఉంది.

మన అర్ష్‌ కూడా
ఇక బౌలర్ల విషయానికొస్తే.. వనిందు హసరంగ అగ్ర స్థానంలో ఉండగా.. టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు తొమ్మిదో స్థానం దక్కింది. ఈ లిస్ట్‌లో కూడా అర్ష్‌, సామ్‌ కర్రన్‌, షాదాబ్‌ ఖాన్‌ తప్ప మిగిలిన వాళ్లు క్వాలిఫైయర్స్‌ ఆడారు. కాగా నవంబరు 13న ఫైనల్‌తో ప్రపంచకప్‌-2022 టోర్నీకి ముగియనుంది.

టీ20 ప్రపంచకప్‌ 2022: సూపర్‌-12
అత్యధిక పరుగుల వీరులు
1. విరాట్‌ కోహ్లి(ఇండియా)-246
2. మాక్స్‌ ఒడౌడ్‌(నెదర్లాండ్స్‌)-242
3. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 225
4. కుశాల్‌ మెండిస్‌ (శ్రీలంక)- 223
5. సికందర్‌ రజా(జింబాబ్వే)- 219

6. పాతుమ్‌ నిసాంక (శ్రీలంక)- 214
7. లోర్కాన్‌ టకర్‌ (ఐర్లాండ్‌)- 204
8. గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌)- 195
9. షాంటో (బంగ్లాదేశ్‌)- 180
10. ధనుంజయ డి సిల్వ(శ్రీలంక)- 177

అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు
1. వనిందు హసరంగ (శ్రీలంక)- 15
2. బాస్‌ డి లీడ్‌ (నెదర్లాండ్స్‌)- 13
3. బ్లెస్సింగ్ ముజరబానీ (జింబాబ్వే)- 12
4. అన్రిచ్‌ నోర్జే (సౌతాఫ్రికా)- 11
5. జాషువా లిటిల్‌ (ఐర్లాండ్‌)- 11

6. వాన్‌ మెకరిన్‌ (నెదర్లాండ్స్‌)- 11
7. సామ్‌ కర్రన్‌ (ఇంగ్లండ్‌)- 10
8. షాదాబ్‌ ఖాన్‌(పాకిస్తాన్‌)- 10
9. అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఇండియా)- 10
10. సికందర్‌ రజా (జింబాబ్వే)- 10

చదవండి: WC 2022: ఒక్క క్యాచ్‌తో తారుమారు: సౌతాఫ్రికాలో పుట్టి ఆ జట్టునే దెబ్బకొట్టిన ప్లేయర్లు.. టీమ్‌లో తెలుగు కుర్రాడు కూడా!
T20 WC 2022: సెమీ ఫైనల్‌ జట్లు, షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌.. ఇతర వివరాలు

Poll
Loading...

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు