Ravichandran Ashwin: ఆ బంతి తిరిగి ఉంటే రిటైర్మెంట్‌ ఇచ్చేవాడిని!

28 Oct, 2022 18:40 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్‌పై విజయంలో కోహ్లిదే కీలకపాత్ర అనేది నగ్నసత్యం. అయితే కోహ్లితో పాటు అశ్విన్‌కు కూడా విజయంలో క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. ఆఖరి ఓవర్‌లో మహ్మద్‌ నవాజ్‌ వేసిన బంతిని వైడ్‌గా భావించి అశ్విన్‌ వదిలేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీసి టీమిండియాకు విజయాన్ని అందించాడు.

అయితే కోహ్లి మ్యాజిక్‌లో అశ్విన్‌ తెలివిని ఎవరు గుర్తించలేకపోయారు. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత అశ్విన్‌ చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు. స్వయంగా కోహ్లినే అశ్విన్‌ను.. సరైన సమయంలో మెదుడు చురుకుగా పనిచేసింది అంటూ పొగడడం విశేషం.తాజాగా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పాక్‌తో మ్యాచ్‌ అనంతరం తన సహచరుల నుంచి ఎదురైన ప్రశ్నను పంచుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నవాజ్‌ వేసిన బంతి  వైడ్ కాకుండా తిరిగి ఉంటే ఏమయ్యేది అని అడిగారు. వాళ్లు అడిగిన ప్రశ్నకు నా శైలిలో సమాధానం ఇచ్చాను.

''ఈ మ్యాచ్ లో నేను బ్యాటింగ్ కు వెళ్లేప్పుడు బ్లాంక్ మైండ్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాను.  బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడని కోహ్లీని అడిగాను. అప్పుడు కోహ్లీ నా ఫేవరేట్ షాట్ కొట్టు పర్లేదు అని చెప్పాడు. అయితే మ్యాచ్ గెలిచాం కాబట్టి సరిపోయింది గానీ ఒకవేళ నవాజ్ వేసిన ఆ బంతి వైడ్ గా కాకుండా టర్న్ అయి ప్యాడ్ కు తాకడమో లేక పరుగులు రాకపోవడమో అయితే నువ్వు ఏం చేసేవాడివని అడిగారు.

నేను వారితో.. ఏం లేదు. వెంటనే అక్కడ్నుంచి  డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయి  నా ఫోన్ లో ట్విటర్ ఓపెన్ చేసి.. ''ఇన్నాళ్లు నన్ను ఆదరించిన అభిమానులకు, బీసీసీఐకి ధన్యవాదాలు.. ఈ ప్రయాణం చాలా గొప్పది.. ఇక గుడ్ బై'' అని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించేవాడిని..'' అని పేర్కొన్నా'' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. 

చదవండి: నెదర్లాండ్స్‌పై గెలుపు.. 'సంతోషంగా మాత్రం లేను'

క్రికెట్‌ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు

మరిన్ని వార్తలు