Virat Kohli: క్రీడాస్ఫూర్తిని చాటుకున్న టీమిండియా.. స్కాట్లాండ్‌ డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లి

6 Nov, 2021 11:28 IST|Sakshi

T20 WC: Virat Kohli Visiting Scotland Dressing Room Photos Goes Viral: క్రీడాస్ఫూర్తిని చాటుకోవడంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అయినా సరే మంచి ప్రదర్శన కనబరిస్తే ప్రశంసిస్తాడు. భారత జట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోని తరహాలోనే జూనియర్లకు సలహాలు ఇస్తాడు కూడా. టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీ ఆరంభంలో పాకిస్తాన్‌తో ఓటమి పాలైనప్పటికీ.. ధోనితో పాటు కోహ్లి సైతం చిరకాల ప్రత్యర్థి జట్టును అభినందించిన సంగతి తెలిసిందే. 

ఇక నవంబరు 5న స్కాట్లాండ్‌పై విజయం తర్వాత డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి.. వారితో కాసేపు ముచ్చటించాడు.

కెప్టెన్‌తో పాటు రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా సహా పలువురు ఆటగాళ్లు సైతం వారితో మాట్లడారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను క్రికెట్‌ స్కాట్లాండ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

మాకోసం సమయం కేటాయించిన విరాట్‌ కోహ్లి, ఆయన బృందం పట్ల గౌరవభావం మరింత పెరిగింది’’అంటూ క్యాప్షన్‌ జతచేసింది.

కాగా టీమిండియాతో మ్యాచ్‌కు ముందు రోజు మీడియాతో మాట్లాడిన స్కాట్లాండ్‌ కెప్టెన్‌ కైల్‌ కొయెట్జర్‌.. విరాట్‌ కోహ్లి తమ డ్రెస్సింగ్‌రూమ్‌ వచ్చి తమతో మాట్లాడాలని కోరిన సంగతి తెలిసిందే. టాస్‌ సమయంలో కోహ్లితో కలిసి నిలబడటం గొప్పగా భావిస్తానన్న అతడు.. తమ ఆటగాళ్లలో కోహ్లి మాటలు స్ఫూర్తినింపుతాయని చెప్పుకొచ్చాడు. ఇక కైల్‌ విజ్ఞప్తి నేపథ్యంలో కోహ్లి ఈ మేరకు స్కాట్లాండ్‌ ఆటగాళ్లతో ముచ్చటించడం విశేషం. కాగా స్కాట్లాండ్‌పై భారీ విజయంతో టీమిండియా సెమీస్‌ అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

స్కోర్లు:
స్కాట్లాండ్‌- 85 (17.4)
భారత్‌- 89/2 (6.3)

చదవండి: Virat Kohli: పుట్టినరోజున సంతోషం.. జడ్డూ సూపర్‌.. నవంబరు 7న ఏం జరుగుతుందో మరి!  

Poll
Loading...
మరిన్ని వార్తలు