T20 World Cup 2021: తొలి వికెట్‌, తొలి హాఫ్‌ సెంచరీ.. ఎవరిదో తెలుసా?!

17 Oct, 2021 19:00 IST|Sakshi
తొలి వికెట్‌ తీసిన బౌలర్‌ బిలాల్‌ ఖాన్‌(PC: T20 World Cup)

T20 World Cup 2021 Match 1 Interesting Facts: క్రికెట్‌ ప్రేమికులకు మజాను అందించేందుకు పొట్టి ప్రపంచకప్‌ టోర్నీ మొదలైపోయింది. ఆదివారం(అక్టోబరు 17) ఒమన్‌ వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2021 తొలి మ్యాచ్‌ జరిగింది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా(రౌండ్‌ 1) గ్రూపు-బిలోని ఒమన్‌- పపువా న్యూగినియా మధ్య మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమైంది. మెగా ఈవెంట్‌లోని మొదటి మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు..

టీ20 వరల్డ్‌కప్‌-2021:
టాస్‌ గెలిచిన జట్టు- ఒమన్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు- పపువా న్యూగినియా
తొలి వికెట్‌- బిలాల్‌ ఖాన్‌(ఒమన్‌)- టోనీ ఉరాను అవుట్‌ చేశాడు
తొలి అర్ధ సెంచరీ- అసద్‌ వాలా(పపువా కెప్టెన్‌)
తొలి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌- జీషన్‌ మక్సూద్‌(ఒమన్‌ సారథి)


 

తొలి బౌండరీ- చార్లెస్‌ అమిని(పపువా న్యూగినియా)
తొలి సిక్సర్‌-చార్లెస్‌ అమిని(పపువా న్యూగినియా)


తొలి రనౌట్‌- చార్లెస్‌ అమిని(పపువా న్యూగినియా)
తొలి విజయం సాధించిన జట్టు- ఒమన్‌
 

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌- జీషన్‌ మక్సూద్‌(4/20)
అత్యధిక పరుగులు- జతీందర్‌ సింగ్‌(73 నాటౌట్‌), 7 ఫోర్లు, 4 సిక్సర్లు)

పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన ఆటగాళ్లు- టోనీ ఉరా(0), లెగా సియాకా(0)(పపువా)
తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి అర్హత సాధించిన పపువాపై 10 వికెట్ల తేడాతో ఒమన్‌ విజయం.

తుది జట్లు: 
పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్‌ వాలా(కెప్టెన్‌), చార్లెస్‌ అమిని, లెగా సియాకా, నార్మన్‌ వనువా, సెసె బా, సిమన్‌ అటాయి, కిప్లిన​ డొరిగా(వికెట్‌ కీపర్‌), నొసైనా పొకానా, డామిన్‌ రవూ, కబువా మోరియా.

ఒమన్‌: జతీందర్‌ సింగ్‌, ఖవార్‌ అలీ, ఆకిబ్‌ ఇలియాస్‌, జీషన్‌ మక్సూద్‌(కెప్టెన్‌), నసీం ఖుషి(వికెట్‌ కీపర్‌), కశ్యప్‌ ప్రజాపతి, మహ్మద్‌ నదీం, అయాన్‌ ఖాన్‌, సందీప్‌ గౌడ్‌, కలీముల్లా, బిలాల్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు