IND Vs NZ: భువనేశ్వర్‌ను తీసేయండి.. అతడిని తీసుకోండి

31 Oct, 2021 14:26 IST|Sakshi

Shardul Thakur: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా  భారత్ నేడు  కీలక మైన పోరులో న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠత ఇంకా  కొనసాగుతోంది. ఇక  ఫామ్ కోల్పోయిన భువనేశ్వర్ కుమార్‌ స్ధానంలో తుది జట్టులో శార్ధూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించాలని మాజీలు, క్రికెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఈ కోవలోనే భారత్‌ మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కూడా చేరాడు. న్యూజిలాండ్‌తో జరగబోతున్న ఈ కీలకమైన  మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను తప్పించి శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో షేర్ చేసిన ఆకాష్ చోప్రా.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ మార్పులు చేయాలా? వద్దా? అనే ఆంశంపై చర్చించాడు.  

"నా అభిప్రాయం ప్రకారం.. శార్దూల్ ఠాకూర్ గురించి టీమిండియా ఆలోచించాలి. నేనైతే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తాను. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలర్‌ అయినప్పటీకీ..  ప్రస్తుతం ఫామ్‌లో లేడు. ఠాకూర్‌కి వికెట్లు తీసే సత్తా ఉంది. అతడు  పవర్‌ప్లేలో ఒక ఓవర్, మిడిల్‌ ఓవర్లలో ఒకటి లేదా రెండు ఓవర్లు, చివర్లో ఒక ఓవర్ వేయగలడు. నిజం చెప్పాలంటే ఫాస్ట్ బౌలర్ల విషయంలో శార్దూల్ తప్ప వేరే ఆప్షన్ టీమిండియాకు లేదు" అని  ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

చదవండి: కోహ్లిని వెంటాడుతున్న ఆ చెత్త రికార్డు.. సోధి మళ్లీ మెరుస్తాడా!

మరిన్ని వార్తలు