T20 WC 2021 AFG Vs NAM: చెలరేగిన పేసర్లు.. అఫ్గాన్‌కు మరో భారీ విజయం

31 Oct, 2021 19:04 IST|Sakshi

చెలరేగిన పేసర్లు.. అఫ్గాన్‌కు మరో భారీ విజయం
సమయం 18: 58.. 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గాన్‌ పేసర్లు నవీన్‌ ఉల్‌ హక్‌(3/26), గుల్బదిన్‌ నయాబ్‌(2/19), హమీద్‌ హసన్‌(3/9), స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌(1/14)  చెలరేగిపోవడంతో పసికూన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా అఫ్గాన్‌ టోర్నీలో మరో భారీ విజయాన్ని(62 పరుగుల తేడాతో) నమోదు చేసింది. నమీబియా ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వీజ్‌ చేసిన 26 పరుగులే అత్యధికం. 

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అప్గాన్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌(27 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అహ్మద్‌ షెజాద్‌(33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు అస్గర్‌ అఫ్గాన్‌(23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌), మహ్మద్‌ నబీ(17 బంతుల్లో 32య నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్‌, లాప్టీ ఈటన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జెజె స్మిట్‌కు ఓ వికెట్‌ దక్కింది. 

77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన నమీబియా
సమయం 18:39..గుల్బదిన్‌ మరోసారి చెలరేగాడు. 16వ ఓవర్‌ ఆఖరి బంతికి పిక్కి ఫ్రాన్స్‌(5 బంతుల్లో 3)ను కాట్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. ఫలితంగా నమీబియా జట్టు 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. క్రీజ్‌లో డేవిడ్‌ వీజ్‌(25), ట్రంపెల్మాన్‌ ఉన్నారు. 

69 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన నమీబియా..
సమయం 18:33.. నవీన్‌ ఉల్‌ హక్‌ వేసిన 15వ ఓవర్లో నమీబియా ఏడో వికెట్‌ను కోల్పోయింది. భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన జాన్‌ ఫ్రైలింక్‌(14 బంతుల్లో 6) నబీ చేతికి చిక్కి ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 73/7. క్రీజ్‌లో డేవిడ్‌ వీజ్‌(24), పిక్కి ఫ్రాన్స్‌(3) ఉన్నారు. 

ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. నమీబియా స్కోర్‌ 56/6
సమయం 18:17.. అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి నమీబియా జట్టు వణికిపోతుంది. 11 ఓవర్లలో కేవలం 56 పరుగులు మాత్రమే చేసి ఆరు ​వికెట్లు కోల్పోయింది. అఫ్గాన్‌ పేసర్‌ హమీద్‌ హసన్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి నమీబియా నడ్డి విరిచాడు. 10.3వ ఓవర్లో ఎరాస్మస్‌(14 బంతుల్లో 12)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన హమీద్‌.. అదే ఓవర్‌ ఆఖరి బంతికి జెజె స్మిట్‌(0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. క్రీజ్‌లో డేవిడ్‌ వీజ్‌(15), ఫ్రైలింగ్‌ ఉన్నారు. 

గ్రీన్‌(1) క్లీన్‌ బౌల్డ్‌.. నమీబియా స్కోర్‌ 36/4
సమయం 17: 57.. రషీద్‌ ఖాన్‌ వచ్చీ రాగనే ప్రతాపాన్ని చూపాడు. తన కోటా తొలి బంతికే జేన్‌ గ్రీన్‌(7 బంతుల్లో 1)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 7.1 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 36/4. క్రీజ్‌లో గెర్హార్డ్‌ ఎరాస్మస్‌(7), డేవిడ్‌ వీజ్‌ ఉన్నారు.

లాఫ్టీ ఈటెన్‌(14) క్లీన్‌ బౌల్డ్‌.. నమీబియా స్కోర్‌ 29/3
సమయం 17:45.. గుల్బదిన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5.2వ ఓవర్లో లాఫ్టీ ఈటెన్‌(16 బంతుల్లో 14; సిక్స్‌) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఫలితంగా నమీబియా జట్టు 29 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో జేన్‌ గ్రీన్‌, గెర్హార్డ్‌ ఎరాస్మస్‌(2) ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన నమీబియా.. 
సమయం: 17:33.. మైకెల్‌ వాన్‌ లింజెన్‌(11) రూపంలో నమీబియా రెండో వికెట్‌ కోల్పోయింది. నవీన్‌ హుల్‌ హక్‌ బౌలింగ్‌లో లింజెన్‌ హమీద్‌కు క్చాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం నమీబియా 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది.

నమీబియాకు తొలి ఓవర్లోనే షాక్‌..క్రెయిగ్‌ విలియమ్స్‌(1) ఔట్‌
సమయం 17:21.. అఫ్గాన్‌ నిర్ధేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియాకు తొలి ఓవర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ క్రెయిగ్‌ విలియమ్స్‌(4 బంతుల్లో 1)ను నవీన్‌ ఉల్‌ హక్‌ పెవిలియన్‌కు పంపాడు. 0.4 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 2/1. క్రీజ్‌లో వాన్‌ లింగెన్‌(1), లాఫ్టీ ఈటెన్‌ ఉన్నారు. 

రాణించిన అఫ్గాన్‌ బ్యాటర్లు.. నమీబియా విజయ లక్ష్యం 161
సమయం 17:07.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అప్గాన్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌(27 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అహ్మద్‌ షెజాద్‌(33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు అస్గర్‌ అఫ్గాన్‌(23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌), మహ్మద్‌ నబీ(17 బంతుల్లో 32య నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్‌, లాప్టీ ఈటన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జెజె స్మిట్‌కు ఓ వికెట్‌ దక్కింది.

అస్గర్‌ అఫ్గాన్‌(31) ఔట్‌.. అఫ్గానిస్థాన్‌ 148/5 
సమయం 17:00.. జట్టు స్కోర్‌ 148 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ట్రంపెల్మాన్‌ బౌలింగ్‌లో రూబెన్‌కు క్యాచ్‌ ఇచ్చి అస్గర్‌ అఫ్గాన్‌(23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత అఫ్గాన్‌ స్కోర్‌ 148/5. క్రీజ్‌లో మహ్మద్‌ నబీ(21), గుల్బదిన్‌ ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన అఫ్గాన్‌.. జద్రాన్‌(7) ఔట్‌
సమయం 16: 41.. నమీబియా స్పిన్నర్‌ లాప్టీ ఈటన్‌ మరోసారి మెరిశాడు. ఇన్నింగ్స్‌ 15.4వ ఓవర్లో నజీబుల్లా జద్రాన్‌(11 బంతుల్లో 7; ఫోర్‌)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. 16 ఓవర్ల తర్వాత అఫ్గాన్‌ స్కోర్‌ 114/4. క్రీజ్‌లో మహ్మద్‌ నబీ, అస్గర్‌ అఫ్గాన్‌(19) ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన అఫ్గాన్‌.. షెజాద్‌(45) ఔట్‌
సమయం 16: 26.. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో అఫ్గాన్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న అహ్మద్‌ షెజాద్‌(33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను ట్రంపెల్మాన్‌ పెవిలియన్‌కు పంపాడు. 13 ఓవర్ల తర్వాత అఫ్గాన్‌ స్కోర్‌ 89/3. క్రీజ్‌లో అస్గర్‌ అఫ్గాన్‌(5), నజీబుల్లా జద్రాన్‌ ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన అఫ్గాన్‌.. గుర్బాజ్‌(4) ఔట్‌
సమయం 16: 11.. ఇన్నింగ్స్‌ 9.5వ ఓవర్లో అఫ్గాన్‌కు రెండో షాక్‌ తగిలింది. వన్‌డౌన్‌ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌(8 బంతుల్లో 4).. లాప్టీ ఈటన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 10 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 69/2. క్రీజ్‌లో మహ్మద్‌ షెజాద్‌(30), అస్గర్‌ అఫ్గాన్‌(1) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన అఫ్గాన్‌.. జజాయ్‌(33) ఔట్‌
సమయం 15: 58.. ధాటిగా ఆడుతున్న అఫ్గాన్‌ ఓపెనర్‌ హజ్రతుల్లా జజాయ్‌(27 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ను జెజె స్మిట్‌ బోల్తా కొట్టించాడు. 6.4వ ఓవర్లో మైఖేల్‌ వాన్‌ లింగెన్‌ క్యాచ్‌ పట్టడంతో జజాయ్‌ ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత అఫ్గాన్‌ స్కోర్‌ 53/1. క్రీజ్‌లో షెజాద్‌(19), రహ్మానుల్లా గుర్బాజ్‌ ఉన్నారు. 

ధాటిగా ఆడుతున్న అఫ్గాన్‌ ఓపెనర్లు.. 6 ఓవర్ల తర్వాత 50/0
సమయం 15: 55.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌(25 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు ), అహ్మద్‌ షెజాద్‌(11 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌ ) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరి ధాటికి అప్గాన్‌ జట్టు కేవలం 6 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరుకుంది. 

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్‌ 12 గ్రూప్‌-2లో భాగంగా ఆదివారం(అక్టోబర్‌ 31) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో అఫ్గాన్‌ ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడగా.. ఓ విజయం(స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో విజయం) మరో పరాజయం(పాక్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి)తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.

మరోవైపు నమీబియా సూపర్‌-12లో ఆడిన ఏకైక మ్యాచ్‌(స్కాట్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపు)లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తుంది. పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తలపడలేదు. ఇప్పటివరకు 4 టీ20 ప్రపంచకప్‌లలో(2010, 2012, 2014, 2016) పాల్గొన్న అఫ్గాన్‌.. 2016లో సూపర్‌ 10 దశకు చేరడమే అత్యుత్తమం కాగా.. నమీబియా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి.   
తుది జట్లు:
నమీబియా : క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్‌ కీపర్‌), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్‌), డేవిడ్ వీస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిట్‌, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్

అఫ్గానిస్థాన్ : హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(వికెట్‌ కీపర్‌), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్‌), అస్గర్ అఫ్గాన్, గుల్బదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, హమీద్‌ హసన్‌

మరిన్ని వార్తలు