T20 WC 2021 AFG Vs SCO: చెలరేగిన స్పిన్నర్లు.. అఫ్గానిస్థాన్‌ భారీ విజయం

25 Oct, 2021 22:49 IST|Sakshi

చెలరేగిన స్పిన్నర్లు.. అఫ్గానిస్థాన్‌ భారీ విజయం
191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ను అఫ్గాన్‌ స్పిన్నర్లు తిప్పేశారు. ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌(5/20), రషీద్‌ ఖాన్‌(4/9), నవీన్‌ ఉల్‌ హక్‌(1/12)  ధాటికి స్కాట్లాండ్‌ 10.2 ఓవర్లలో 60 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో ఆఫ్గనిస్థాన్‌ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్‌ కాగా, మున్సే(25), కొయెట్జర్‌(10), క్రిస్‌ గ్రీవ్స్‌(12) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. పాంచ్‌ పటాకాతో చెలరేగిన ముజీబ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

అఫ్గాన్‌ స్పిన్నర్ల మాయాజాలం.. 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌    
సమయం 9: 57.. అఫ్గాన్‌ స్పిన్నర్లు పోటీపడి మరీ వికెట్లు తీస్తున్నారు. తొలుత ముజీబ్‌ నాలుగు వికెట్లు తీసి స్కాట్లాండ్‌ నడ్డి విరచగా.. 7వ ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌ చెలరేగాడు. లీస్క్‌(0)ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు. 7 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 40/6. 

ముజీబ్‌ మాయాజాలం.. 8 బంతుల్లో 4 వికెట్లు
సమయం 9: 54.. ముజీబ్‌ మరోసారి చెలరేగాడు. 6వ ఓవర్‌ మూడో బంతికి మున్సే(18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలో అతను నాలుగో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 6 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 37/5. 

అఫ్గాన్‌ బౌలర్ల విజృంభణ.. 2 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌
సమయం 9: 47.. నవీన్‌ ఉల్‌ హక్‌ వేసిన 5 ఓవర్‌లో స్కాట్లాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. వికెట్‌కీపర్‌ మహ్మద్‌ షెజాద్‌కు క్యాచ్‌ ఇచ్చి మ్యాథ్యూ క్రాస్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 30/4. 

ముజీబ్‌ ఆన్‌ ఫైర్‌.. ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌
సమయం 9: 42.. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి స్కాట్లాండ్‌ నడ్డి విరిచాడు. 3వ ఓవర్‌ రెండో బంతికి కొయెట్జర్‌ వికెట్‌ తీసిన ముజీబ్‌.. మూడో బంతికి మెక్‌లియోడ్‌(0), ఆఖరి బంతికి బెర్రింగ్టన్‌(0)ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 28/3.

తొలి వికెట్‌ కోల్పోయిన స్కాట్లాండ్‌.. కొయెట్జర్‌(10) క్లీన్‌ బౌల్డ్‌
సమయం 9: 36.. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన స్కాట్లాండ్‌ 3వ ఓవర్‌ రెండో బంతికి తొలి వికెట్‌ను కోల్పోయింది. ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ బౌలింగ్‌లో కొయెట్జర్‌(7 బంతుల్లో 10; 2 ఫోర్లు) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 3.2 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 28/1. క్రీజ్‌లో మున్సే, మెక్‌లియోడ్‌ ఉన్నారు.

చెలరేగిన అఫ్గాన్‌ బ్యాటర్లు.. స్కాట్లాండ్‌ ముందు భారీ లక్ష్యం
సమయం 9: 13.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ భారీ స్కోర్‌ సాధిం​చింది. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు స్కోర్‌ చేసింది. నజీబుల్లా జద్రాన్‌(34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా.. హజ్రతుల్లా జజాయ్‌(30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రహ్మానుల్లా గుర్బాజ్‌(37 బంతుల్లో 46; ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో సాఫ్యాన్‌ షరీఫ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. జోష్‌ డేవి, మార్క్‌ వాట్‌లకు తలో వికెట్‌ దక్కింది. 

గుర్బాజ్‌(46) ఔట్‌.. అఫ్గాన్‌ 169/3
సమయం 9: 03.. ఇన్నింగ్స్‌ 18.3 వ ఓవర్లో అఫ్గాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. డేవీ బౌలింగ్‌లో కొయెట్జర్‌కు క్యాచ్‌ ఇచ్చి రహ్మానుల్లా గుర్బాజ్‌(37 బంతుల్లో 46; ఫోర్‌, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత అప్గాన్‌ స్కోర్‌ 176/3. క్రీజ్లో నజీబుల్లా జద్రాన్‌(30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్‌ నబీ(2 బంతుల్లో 6) ఉన్నారు. 

భారీ స్కోర్‌ దిశగా అఫ్గాన్‌.. 15 ఓవర్ల తర్వాత 127/2
సమయం 8: 41.. 82 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన అఫ్గాన్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తుంది. రహ్మానుల్లా గుర్బాజ్‌(30 బంతుల్లో 31; ఫోర్‌, 2 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్‌(15 బంతుల్లో 25; 4 ఫోర్లు) ధాటిగా ఆడుతున్నారు. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 127/2. స్కాట్లాండ్‌ బౌలర్లలో జోష్‌ డేవి, మార్క్‌ వాట్‌కు తలో వికెట్‌ దక్కింది. 

అఫ్గాన్‌ రెండో వికెట్‌ డౌన్‌.. జజాయ్‌(44) ఔట్‌
సమయం 8: 17.. ధాటిగా ఆడుతున్న అఫ్గాన్‌ ఓపెనర్‌ హజ్రతుల్లా జజాయ్‌(30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మార్క్‌ వాట్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 9.5 ఓవర్ల తర్వాత అఫ్గానిస్థాన్‌ స్కోర్‌ 82/2. క్రీజ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌(14 బంతుల్లో 11), నజీబుల్లా జద్రాన్‌ ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన అఫ్గాన్‌.. షెజాద్‌(22) ఔట్‌
సమయం 7: 59.. ఇన్నింగ్స్‌ 5.5వ ఓవర్లో అఫ్గానిస్థాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సాఫ్యాన్‌ షరీఫ్‌ బౌలింగ్‌లో క్రిస్‌ గ్రీవ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి మహ్మద్‌ షెజాద్‌(15 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) పెవిలియన్‌ బాట పట్టాడు. 6 ఓవర్ల తర్వాత అఫ్గాన్‌ స్కోర్‌ 55/1. క్రీజ్‌లో హజ్రతుల్లా జజాయ్‌(21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్‌), రహ్మానుల్లా గుర్బాజ్‌ ఉన్నారు. 

అఫ్గానిస్థాన్‌ శుభారంభం.. 5 ఓవర్ల తర్వాత 46/0
సమయం 7: 55.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు మహ్మద్‌ షెజాద్‌(11 బంతుల్లో 15; ఫోర్‌, సిక్స్), హజ్రతుల్లా జజాయ్‌(19 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్‌) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరిద్దరి ధాటికి అఫ్గాన్‌ స్కోర్‌ 5 ఓవర్ల తర్వాత 46/0గా ఉంది. 

షార్జా: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్‌ 12 గ్రూప్‌-2లో భాగంగా సోమవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. సూపర్‌ 12కు అర్హత సాధించే క్రమంలో స్కాట్లాండ్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, అఫ్గానిస్థాన్‌ నేరుగా ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది. ముఖాముఖి పోరు విషయానికొస్తే.. 

పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల 6 సార్లు తలపడగా.. అన్నింటిలో అఫ్గానిస్థాన్‌ జట్టే విజయాలు సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో కూడా అఫ్గాన్‌దే పైచేయిగా ఉంది. అఫ్గానిస్థాన్‌ ఇప్పటివరకు ఆడిన 4 టీ20 ప్రపంచకప్‌లలో(2010, 2012, 2014, 2016) కేవలం ఒక్కసారి(2016) మాత్రమే సూపర్‌ 10 దశకు చేరుకోగలిగింది. మరోవైపు స్కాట్లాండ్‌ 2007, 2009, 2016 ప్రపంచకప్‌లకు అర్హత సాధించినప్పటికీ ఒక్కసారి కూడా గ్రూప్‌ దశ దాటలేకపోయింది.  

తుది జట్లు:
అఫ్గానిస్థాన్‌: హజ్రతుల్లా జజాయ్‌, మహ్మద్‌ షెజాద్‌(వికెట్‌కీపర్‌), రహ్మానుల్లా గుర్బాజ్‌, అస్గర్‌ అఫ్గాన్‌, నజీబుల్లా జద్రాన్‌, మహ్మద్‌ నబీ(కెప్టెన్‌), గుల్బదిన్‌ నైబ్‌, రషీద్‌ ఖాన్‌, కరీమ్‌ జనత్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌

స్కాట్లాండ్‌: జార్జ్‌ మున్సే, కైల్‌ కొయెట్జర్‌(కెప్టెన్‌), మాథ్యూ క్రాస్‌, రిచీ బెర్రింగ్టన్‌, కలమ్‌ మెక్‌లియోడ్‌, మైఖేల్‌ లీస్క్‌, క్రిస్‌ గ్రీవ్స్‌, మార్క్‌ వాట్‌, జోష్‌ డేవీ, సాఫ్యాన్‌ షరీఫ్‌, బ్రాడ్లీ వీల్‌

మరిన్ని వార్తలు