T20 WC 2021 AUS Vs SL: వార్నర్‌ మెరుపులు.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం

29 Oct, 2021 15:11 IST|Sakshi

వార్నర్‌ మెరుపులు.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం
సమయం: 22:45.. డేవిడ్‌ వార్నర్‌(65;42 బంతులు) మెరుపులు మెరిపించడంతో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 18 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. పించ్‌, వార్నర్‌లు కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు పునాది వేశారు. ఫించ్‌, మ్యాక్స్‌వెల్‌ ఔటైన తర్వాత వార్నర్‌ జోరు చూపగా.. స్మిత్‌ 28 పరగులు నాటౌట్‌ రాణించాడు. ఇక చివర్లో మార్కస్‌ స్టోయినిస్‌ 7 బంతుల్లో 16 పరుగులతో తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ఆస్ట్రేలియా సూపర్‌ 12 దశలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగా రెండు వికెట్లు తీశాడు.

డేవిడ్‌ వార్నర్‌(65) ఔట్‌.. 16 ఓవర్లలో 140/3
సమయం: 22:36.. డేవిడ్‌ వార్నర్‌(65) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. షనక బౌలింగ్‌లో రాజపక్సకు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ వెనుదిరిగాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆసీస్‌ విజయానికి ఇంకా 15 పరుగుల దూరంలో ఉంది.

వార్నర్‌ హాఫ్‌ సెంచరీ.. 13 ఓవర్లలో ఆస్ట్రేలియా 112/2
సమయం: 22:20.. 13 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 30 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో అర్థసెంచరీ మార్క్‌ను సాధించాడు. కాగా అంతకముందు 5 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ హసరంగ బౌలింగ్‌లో ఫెర్నాండోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఫించ్‌(37) ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన ఆరోన్‌ ఫించ్‌ వనిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 76 పరుగులు చేసింది. వార్నర్‌ 36, మ్యాక్స్‌వెల్‌ 1 పరుగులతో ఆడుతున్నారు.

దాటిగా ఆడుతున్న ఆసీస్‌ ఓపెనర్లు.. 5 ఓవర్లలో 56/0
సమయం: 21:48.. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఆరోన్‌ ఫించ్‌ 36 పరుగులతో, వార్నర్‌ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

శ్రీలంక 154/6.. ఆసీస్‌ టార్గెట్‌ 155
సమయం 21:13..  ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లంక బ్యాటింగ్‌లో కుషాల్‌ పెరీరా, చరిత్‌ అసలంక చెరో 35 పరుగులు చేయగా.. బానుక రాజపక్స 33 పరుగులతో ఆఖర్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో లంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపా తలా రెండు వికెట్లు తీశారు.

సమయం: 21:02.. 18 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 12 పరుగులు చేసిన దాసున్‌ షనక కమిన్స్‌ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక..
లంక జట్టును మిచెల్‌ స్టార్క్‌ మరో దెబ్బ కొట్టాడు. 12.2వ ఓవర్లో హసరంగ(2 బంతుల్లో 4; ఫోర్‌)ను ఔట్‌ చేశాడు. దీంతో ఆ జట్టు 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వికెట్‌కీపర్‌ మాథ్యూ వేడ్‌ క్యాచ్‌ పటట్డంతో హసరంగ పెవిలియన్‌ బాట పట్టాడు. క్రీజ్‌లో రాజపక్స(2), షనక ఉన్నారు. 

అవిష్క ఫెర్నాండో(4) ఔట్‌.. లంక నాలుగో వికెట్‌ డౌన్‌
11వ ఓవర్‌లో మూడో వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంక జట్టుకు ఆ మరుసటి ఓవర్‌లో ఆడమ్‌ జంపా మరో షాకిచ్చాడు. అవిష్క ఫెర్నాండో(7 బంతుల్లో 4)ను పెవిలియన్‌కు పంపి ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. 11.5 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 90/4. క్రీజ్‌లో రాజపక్స(2), హసరంగ ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. కుశాల్‌ పెరీరా(35) ఔట్‌
ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో సిక్సర్‌ బాది జోరుమీదున్న కుశాల్‌ పెరీరా(25 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్‌)ను మిచెల్‌ స్టార్క్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో శ్రీలంక 86 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో అవిష్క ఫెర్నాండో(2), భానుక రాజపక్స ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. 10 ఓవర్లలో 79/2
సమయం: 20:17.. ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ చరిత్‌ అసలంక(35) రూపంలో శ్రీలంక రెండో వికెట్‌ కోల్పోయింది. ఆడమ్‌ జంపా బౌలింగ్‌ ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ నాలుగో బంతికి స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. పెరీరా 29, అవిష్క ఫెర్నాండో 1 పరుగుతో ఆడుతున్నారు. 

సమయం: 19:58.. 6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్‌ నష్టానికి 53 పరుగులు చేసింది. చరిత అసలంక(26 పరుగులు) దాటిగా ఆడుతుండగా.. పెరీరా 11 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన లంక..
సమయం: 19:43.. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సాంక(7) రూపంలో శ్రీలంక తొలి వికెట్‌ కోల్పోయింది. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిస్సాంక పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం శ్రీలంక 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. అసలంక 20, కుషాల్‌ పెరీరా 7 పరుగులతో ఆడుతున్నారు.

దుబాయ్‌: టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌ 12 గ్రూఫ్‌ 1లో నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సూపర్‌ 12 దశలో ఇరుజట్లు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఇక 2010 టి20 ప్రపంచకప్‌ తర్వాత ఆస్ట్రేలియ, శ్రీలంక తలపడడం మళ్లీ ఇదే. ఇక ముఖాముఖి పోరులో టి20ల్లో 16 సార్లు తలపడగా.. 8 సార్లు ఆసీస్‌.. 8 సార్లు లంక విజయాలు అందుకుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా.. రెండుసార్లు ఆసీస్‌.. ఒకసారి లంక విజయం అందుకుంది. 

శ్రీలంక: దాసున్ షనక(కెప్టెన్‌), కుశాల్ పెరీరా(వికెట్‌ కీపర్‌), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, వనిందు హసరంగా, భానుక రాజపక్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ

ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్(కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

మరిన్ని వార్తలు