T20 WC 2021 BAN Vs PNG: బంగ్లాకు భారీ విజయం.. సూపర్‌ 12కు అర్హత!

21 Oct, 2021 19:06 IST|Sakshi

బంగ్లాకు భారీ విజయం.. సూపర్‌ 12కు అర్హత!
పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్‌-బి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 84 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా 19.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారీ విజయం దక్కించుకున్న బంగ్లాదేశ్‌ గ్రూఫ్‌-బి నుంచి సూపర్‌ 12 దశకు అర్హత సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్‌లో కెప్టెన్‌ మహ్మదుల్లా( 50, 28 బంతులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్‌ 46 పరుగులతో రాణించారు. అయితే ఒమన్‌పై స్కాట్లాండ్‌ విజయం అందుకుంటే బంగ్లా నేరుగా సూపర్‌ 12కు వెళుతుంది. అలా కాకుండా ఒమన్‌ గెలిస్తే మాత్రం ఇరు జట్ల మధ్య రన్‌రేట్‌ కీలకం కానుంది.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పపువా న్యూ గినియా ఓటమి దిశగా పయనిస్తోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. కిప్లిన్‌ డోరిగా 36, డామియెన్‌ రావు 1 పరుగులతో ఆడుతున్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన పపువా.. 10 ఓవర్లలో 28/6
పపువా న్యూ గినియా దారుణ ఆటతీరు కనబరుస్తుంది. 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ల దాటికి పసికూన పపువా పరుగులు చేయలేక నానా అవస్థలు పడుతుంది.  

17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పపువా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పపువా 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది.

బంగ్లా భారీ స్కోరు.. పపువా టార్గెట్‌ 182
పపువా న్యూ గినియాతో జరుగతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ భారీస్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్‌లో కెప్టెన్‌ మహ్మదుల్లా( 50, 28 బంతులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్‌ 46 పరుగులతో రాణించారు. 

10 ఓవర్లలో బంగ్లా.. 71/2
బంగ్లాదేశ్‌ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. షకీబ్‌ అల్‌ హసన్‌ 34, ముష్ఫీకర్‌ రహీమ్‌ 5 పరుగుతో ఆడుతున్నారు.  అంతకముందు ఓపెనర్‌ లిటన్‌ దాస్‌(29) రూపంలో బంగ్లాదేశ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అసద్‌వాలా వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ మొదటి బంతికి లిటన్‌ దాస్‌ సీసే బసుకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన బంగ్లా.. 54/2
ఓపెనర్‌ లిటన్‌ దాస్‌(29) రూపంలో బంగ్లాదేశ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అసద్‌వాలా వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ మొదటి బంతికి లిటన్‌ దాస్‌ సీసే బసుకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. షకీబ్‌ అల్‌ హసన్‌ 20, ముష్ఫీకర్‌ రహీమ్‌ 2 పరుగుతో ఆడుతున్నారు. 

5 ఓవర్లలో బంగ్లా 37/1
5 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. లిట్టన్‌ దాస్‌ 20, షకీబ్‌ అల్‌ హసన్‌ 14 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు తొలి ఓవర్‌​ రెండో బంతికే ఓపెనర్‌ మహ్మద్‌ నయీమ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఖౠతా తెరవకుండానే తొలి వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌ మహ్మాద్‌ నయీమ్‌ కబువా మోరియా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. 

అల్‌ అమెరత్‌: టి20 ప్రపంచకప్‌ 2021లో గ్రూఫ్‌ బి క్వాలిఫయర్‌లో భాగంగా బంగ్లాదేశ్‌, పపువా న్యూ గినియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. స్లాట్కాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌ ఒమన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. పపువాపై విజయం సాధించి సూపర్‌ 12 దశకు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఒకవేళ పపువా చేతిలో ఓడిపోతే మాత్రం ఒమన్‌ సూపర్‌ 12 దశకు అర్హత సాధిస్తుంది.

పపువా న్యూ గినియా: లెగా సియాకా, అస్సద్ వాలా (కెప్టెన్‌), చార్లెస్ అమిని, సెసే బౌ, సైమన్ అటాయ్, హిరి హిరి, నార్మన్ వనువా, కిప్లిన్ డోరిగా (వికెట్‌ కీపర్‌), చాడ్ సోపర్, కబువా మోరియా, డామియన్ రావు

బంగ్లాదేశ్ : మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, మహేది హసన్, షకీబ్ అల్ హసన్, నూరుల్ హసన్ (వికెట్‌ కీపర్‌), అఫీఫ్ హొస్సేన్, మహ్మదుల్లా (కెప్టెన్‌), ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్

మరిన్ని వార్తలు