T20 World Cup 2021: స్టార్‌ ఓపెనర్‌కు మొండిచేయి.. బంగ్లా జట్టు ఇదే

9 Sep, 2021 14:12 IST|Sakshi

ఢాకా: ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌ 2021 సందర్భంగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (బీసీబీ) 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆసీస్‌, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షీకీబ్‌ ఆల్‌ హసన్‌, ముష్ఫీకర్‌ రహీమ్‌, లిట్టన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ లాంటి ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. బంగ్లాదేశ్‌ స్టార్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌కు మాత్రం మొండిచేయి చూపింది. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న తమీమ్‌ను బీసీబీ పరిగణలోకి తీసుకోలేదు.

చదవండి: BAN Vs NZ: ముస్తాఫిజుర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. మోచేతికి దెబ్బ తగిలినా

ఇక స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా రూబెల్‌ హుస్సెన్‌, అమినుల్‌ ఇస్లామ్‌ బిప్లాబ్‌లను ఎంపిక చేసింది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌ .. తాజాగా కివీస్‌పై ట20 సిరీస్‌ను గెలుచుకునే పనిలో ఉంది. ఇప్పటికే 3-1 తేడాతో ఆధిపత్యంలో ఉన్న బంగ్లా చివరి టీ20ని గెలిచి 4-1తో ముగించాలని భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్‌ సూపర్‌ 12లో ఎంటర్‌ కావాలంటే ముందుగా క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. క్వాలిఫయింగ్‌ దశలో గ్రూఫ్‌ బిలో ఉన్న బంగ్లాదేశ్‌తో పాటు స్కాట్లాండ్‌, పపువా న్యూ జినియా, ఒమన్‌ ఉన్నాయి. ఇక గ్రూఫ్‌ ఏలో శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా ఉన్నాయి. 

చదవండి: Ishan Kishan T20 World Cup 2021: ఎంపికయ్యానని తెలియగానే ఏడ్చేశాడు

టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ టీ 20 జట్టు: 
మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షైఫ్‌ ఉద్దీన్, షామిమ్‌ ఉద్దీన్

స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్

మరిన్ని వార్తలు