T20 World Cup 2021 BAN Vs SCO : బంగ్లాపై స్కాట్లాండ్‌ సంచలన విజయం

17 Oct, 2021 23:42 IST|Sakshi

Bangladesh vs Scotland, 2nd Match, Group B: టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫైయర్స్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి మూడు బంతుల్లో విజయానికి 18 పరుగులు అవసరం కాగా... బంగ్లా ప్లేయర్‌ మెహిదీ హసన్‌ వరుస షాట్లు బాది (సిక్సర్‌, ఫోర్‌) ఆశలు రేకెత్తించాడు. అయితే, ఆఖరి బంతికి స్కాట్లాండ్‌ ఆటగాడు సఫ్యాన్‌ షరీఫ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి.. ఒక పరుగు మాత్రమే ఇచ్చి తమ జట్టు గెలుపును ఖరారు చేశాడు.

తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. మన్సే(29), క్రిస్‌ గ్రీవ్స్‌(45), మార్క్‌ వాట్‌(22) రాణించారు. క్రిస్‌ గ్రీవ్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లు మెహిదీ హసన్‌కు 3, టస్కిన్‌ అహ్మద్‌కు ఒకటి, ముస్తాఫిజుర్‌కు 2, సైఫుద్దీన్‌కు 1, షకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి. 

స్కోర్లు: స్కాట్లాండ్‌- 140/9 (20)
బంగ్లాదేశ్‌- 134/7 (20)

స్కాట్లాండ్‌ నిర్దేశించిన 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా జట్టు తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ స్కోరు: 87/4 

స్వల్ప ఛేదనలో తడబడుతున్న బంగ్లాదేశ్‌.. 7 ఓవర్ల తర్వాత 28/2
ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో జోష్‌ డేవీ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌(5).. వీల్‌ వేసిన నాలుగో ఓవర్‌లో లిటన్‌ దాస్‌(5) ఔట్‌ అయ్యారు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజ్‌లో షకీబ్‌(10), ముష్ఫికర్‌ రహీమ్‌(5) ఉన్నారు.   

రాణించిన మెహిదీ హసన్‌.. బంగ్లా టార్గెట్‌ 141
బంగ్లా బౌలర్లు సమష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి స్కాట్లాండ్‌ జట్టు 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు సాధించింది. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో మున్సే(23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రాస్‌(17 బంతుల్లో 11; ఫోర్), క్రిస్‌ గ్రీవ్స్‌(28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్‌ వాట్‌(17 బంతుల్లో 22; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్‌ సాధించారు. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్‌ 3 వికెట్లతో స్కాట్లాండ్‌ పతనాన్ని శాసించగా.. షకీబ్‌, ముస్తాఫిజుర్‌ చెరో రెండు వికెట్లు.. తస్కిన్‌ అహ్మద్‌, మహ్మద్ సైఫుద్దీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

చెలరేగిన షకీబ్‌.. 11 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 52/5
బంగ్లా బౌలర్ల ధాటికి స్కాట్లాండ్‌ బ్యాటర్లు వరుస పెట్టి పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో తొలుత మోహిదీ హసన్‌.. మాథ్యూ క్రాస్‌(11), మున్సే(29) వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌కు దెబ్బకొట్టగా, 11వ ఓవర్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌.. బెర్రింగ్టన్‌(2), లీస్క్‌(0) పెవిలియన్‌కు పంపడంతో స్కాట్లాండ్‌ 11 ఓవర్లలో 52 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో కలుమ్‌ మెక్‌లియాడ్‌(5), క్రిస్‌ గ్రీవ్స్‌ ఉన్నారు. 

5 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 26/1
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌.. 5 ఓవర్లు ముగిసే సమయానికి వి​కెట్‌ నష్టానికి 26 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ నాలుగో బంతికి సైఫుద్దీన్‌ బౌలింగ్‌లో స్కాట్లాండ్‌ కెప్టెన్‌ కొయెట్జర్‌(0) క్లీన్‌ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో జార్జ్‌ మున్సే(16 బంతుల్లో 19), మాథ్యూ క్రాస్‌(3) ఉన్నారు. 

అల్‌ అమీరట్‌: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్‌-బీ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.
తుది జట్లు: 
బంగ్లాదేశ్‌: లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌,  షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌(వికెట్‌కీపర్‌), మహ్మదుల్లా(కెప్టెన్‌), అఫిఫ్‌ హోసేన్‌, నరుల్‌ హసన్‌, మెహిదీ హసన్‌, మహ్మద్ సైఫుద్దీన్‌, తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌.

స్కాట్లాండ్‌: జార్జ్‌ మున్సే, కైల్‌ కొయెట్జర్‌(కెప్టెన్‌), మాథ్యూ క్రాస్‌(వికెట్‌కీపర్‌), రిచీ బెర్రింగ్టన్‌, కలుమ్‌ మెక్‌లియాడ్‌, మైఖేల్‌ లీస్క్‌, క్రిస్‌ గ్రీవ్స్‌, మార్క్‌ వాట్‌, జోష్‌ డేవి, సఫ్యాన్‌ షరీఫ్‌, బ్రాడ్లీ వీల్‌.

మరిన్ని వార్తలు