T20 WC 2021: కొత్త లుక్‌లో టీమిండియా జెర్సీ.. ఆ మూడు చుక్కలు ఎందుకంటే 

13 Oct, 2021 15:03 IST|Sakshi

BCCI Launch Team India New Jersey T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021 నేపథ్యంలో టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. జెర్సీ కలర్‌ పాతదే అయినప్పటికి టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో మరి కాస్త కొత్తగా తయారు చేశారు. నేవీ బ్లూ కలర్‌లో ఉండే జెర్సీపై ముందుభాగంలో రాయల్‌ బ్లూ కలర్‌ షేడ్స్‌ ఉంటాయి. దానిపై టీమిండియా స్పాన్సర్స్‌ అయిన ఎమ్‌పీఎల్‌ స్పోర్ట్స్‌, బైజూస్‌ యాప్‌లో వైట్‌ కలర్‌లో కనిపిస్తాయి. ఇండియా అనే అక్షరాలు ఆరెంజ్‌ కలర్‌లో దర్శనమిస్తుంది.

జెర్సీ ఎడమ భాగంలో బీసీసీఐ లోగోతో పాటు కొత్తగా మూడు చుక్కలు కనిపిస్తాయి. క్రికెట్‌ చరిత్రలో టీమిండియా మూడు ప్రపంచకప్‌లు సాధించిదనడానికి ఆ మూడు చుక్కలు సంకేతంగా కనిపిస్తాయి. లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ సారథ్యంలో 1983 వన్డే ప్రపంచకప్‌, ఎంఎస్‌ ధోని సారథ్యంలో 2007 టి20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: Kane Williamson: టీ20 ప్రపంచకప్‌ ముందు కెప్టెన్‌కు గాయం..!


అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 24న పాకిస్తాన్‌తో ఆడనుంది. అయితే అంతకుముందు ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా అక్టోబర్‌ 18, 20న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో ఏవైనా మార్పులు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే అక్టోబర్‌ 15వరకు ఆగాల్సి ఉంది. కాగా ఉమ్రాన్‌ మాలిక్‌, ఆవేశ్‌ ఖాన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు నెట్‌బౌలర్‌గా వారి సేవలు వినియోగించుకోనుంది.

చదవండి: T20 WC Ind Vs Pak: కోహ్లి వద్ద అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి.. కానీ

మరిన్ని వార్తలు