David Warner: టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున తొలి బ్యాటర్‌గా

28 Oct, 2021 23:14 IST|Sakshi

David Warner First Australia Batsman Completes 500 Runs T20 World Cup.. టి20 ప్రపంచకప్‌ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌లు రికార్డులు సాధించారు. ముందుగా 65 పరుగులతో ఫామ్‌ అందుకున్న వార్నర్‌ జట్టును గెలిపించడంతో పాటు ఒక టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఒక మైలురాయిని చేరుకున్నాడు.  వార్నర్‌ 13 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20 ప్రపంచకప్‌ల్లో 500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్‌గా వార్నర్‌ 25 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున టి20 ప్రపంచకప్‌లో 500 పరుగుల మార్క్‌ దాటిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.  

ఇక మ్యాచ్‌లో 37 పరుగులు చేసిన కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 27 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20 క్రికెట్‌లో 2500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ పరుగులు అందుకోవడానికి ఫించ్‌కు 78 మ్యాచ్‌లు అవసరం అయ్యాయి. 

>
మరిన్ని వార్తలు