టీమిండియా మెంటార్‌గా ధోనీ.. గంభీర్‌పై మీమ్స్‌ వర్షం

9 Sep, 2021 14:03 IST|Sakshi

ముంబై: వచ్చే నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీను ప్రపంచకప్‌ కోసం మెంటార్‌గా ఎంపిక చేయడం అభిమానులకు ఫుల్‌ జోష్‌ని ఇచ్చింది. అయితే ధోనీని మెంటార్ ఎంపిక చేయడాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ను అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ధోనీపై విమర్శలు గుప్పించే గౌతం గంభీర్‌కు బీసీసీఐ నిర్ణయం ఎక్కడో కాలుతుందని  వ్యంగ్యంగా  కామెంట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలే గంభీర్‌ని భారత జట్టు నుంచి తప్పించడానికి కారణమయ్యాయని అప్పట్లో టాక్‌ వినిపించేది. 

ముఖ్యంగా ధోనీ బర్తేడే రోజే ఉద్దేశపూర్వకంగా గంభీర్‌ తన ఫేస్‌బుక్ కవర్ పేజీ ఫొటోను మార్చాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తను ఆడిన కీలక 97 పరుగుల ఇన్నింగ్స్ గుర్తుకొచ్చేలా ఫొటోపెట్టాడు.  అదే మ్యాచ్‌లో ధోనీ అజేయంగా 91 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అందుకే గంభీర్‌ ధోనీని బర్తేడే రోజున కూడా కించపరిచాడని అభిమానులు ఆరోపించారు. అయితే ప్రస్తతం గంభీర్‌పై నెటజన్లు మీమ్స్‌ వర్షం కురిపిస్తున్నారు. బర్నాల్ రాసుకోవాలని సూచిస్తున్నారు. ధోనీ ఎదుగుదలను గంభీర్ తట్టుకోలేకపోతున్నాడని, జైషా నిర్ణయాన్ని తప్పుబడుతూ.. బీజేపీకి రాజీనామా చేస్తున్నాడని  కామెంట్ చేస్తున్నారు. ధోనీ మెంటార్ అయినందుకు దేశమంతా సంతోషిస్తుంటే..ఒక వ్యక్తి మాత్రం ఏడుస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.

చదవండి: T20 World Cup Team India Squad 2021: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని

మరిన్ని వార్తలు