IND Vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా ఘనవిజయం..

3 Nov, 2021 18:33 IST|Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా ఘనవిజయం..
టీ20 ప్రపంచకప్‌-2021లో టీమిండియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్‌పై 66 పరుగుల తేడాతో  భారత్‌ ఘనవిజయం సాధించింది. 211 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. ఆఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో కరీం జనత్‌(42), నబీ(35) టాప్‌ స్కోరర్‌లగా నిలిచారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా, ఆశ్విన్‌ రెండు, రవీంద్ర జడేజా,బుమ్రా చెరో వికెట్‌ సాధించారు.

అంతక ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. టీమిండియా  బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(74),రాహుల్‌ (69)పంత్‌(27), హార్దిక్ పాండ్యా(35) పరుగులు సాధించారు. కాగా రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌  140 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

నాలుగో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌... నాయబ్(18) ఔట్‌
సమయం: 22:32.. గుల్బదిన్ నాయబ్ రూపంలో ఆఫ్ఘనిస్తాన్‌ రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన  నాయబ్, ఆశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్‌ నాలుగు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది

13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌...
సమయం: 21:35 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది.  షహజాద్ ఖాతా తెరవకుండానే షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 13 పరుగులు చేసిన జజాయ్‌, బుమ్రా బౌలింగ్‌లో ఠాకుర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది

విధ్వంసం సృష్టించిన టీమిండియా.. ఆఫ్గాన్‌ టార్గెట్‌ 211 పరుగులు 
సమయం: 21:15 ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసం సృష్టించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. టీమిండియా  బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(74),రాహుల్‌ (69)పంత్‌(27), హార్దిక్ పాండ్యా(35) పరుగులు సాధించారు. కాగా రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌  140 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రాహుల్‌ (69)ఔట్‌
సమయం: 20:56... 
147 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 69 పరుగులు చేసిన రాహుల్‌.. గుల్బదిన్ నాయబ్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌య్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి భారత్‌ 160పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో  పంత్‌(15), హార్దిక్ పాండ్యా(1) పరుగులతో ఆడుతున్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రోహిత్‌ శర్మ(74) ఔట్‌
సమయం: 20:49.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా రోహిత్‌ శర్మ రూపంలో తొలి వికెట్‌   కోల్పోయింది. 74 పరుగలు చేసిన రోహిత్‌ ,కరీమ్‌ జనత్‌ బౌలింగ్‌లో నబీకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 140 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి బ్రేక్‌పడింది.15ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి భారత్‌ 142పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్‌ 66, పంత్‌(2)  పరుగులతో ఆడుతున్నారు.

రోహిత్‌ శర్మ ఆర్ధసెంచరీ... 12 ఓవర్లో 107/0
సమయం: 20:30..ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఆర్ధసెంచరీ సాధించాడు. 12ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 107పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ 58 , కేఎల్ రాహుల్‌ 48  పరుగులతో ఉన్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌పై చెలరేగిన భారత ఓపెనర్లు.. 10 ఓవర్లలో 85/0
10ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 85పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ 44 , కేఎల్ రాహుల్‌ 40  పరుగులతో ఆడుతున్నారు.

టీమిండియా 6 ఓవర్లలో 53/0
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు ఆద్బుతంగా ఆడుతున్నారు. 6ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 53పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ 34 , కేఎల్ రాహుల్‌ 18  పరుగులతో ఆడుతున్నారు.

టీమిండియా 4 ఓవర్లలో 35/0
సమయం: 19:55..ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిఇచ్చారు. 4 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 35పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ18 , కేఎల్ రాహుల్‌ 15  పరుగులతో ఆడుతున్నారు.

టీమిండియా 2 ఓవర్లలో 23/0
సమయం: 19:39..  2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 23పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ10 , కేఎల్ రాహుల్‌ 13  పరుగులతో ఆడుతున్నారు.


అబుదాబి: టీ20 ప్రపంచకప్‌-2021లో వరుస ఓటమిలతో ఢీలా పడ్డ టీమిండియా బుధవారం( నవంబరు 3) కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఆఫ్ఘనిస్తాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్‌ కిషన్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి స్ధానంలో  రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కింది. 

ఇప్పటికే  వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై ఓడిపోవడంతో భారత్‌ సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టంగా మార్చుకుంది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ముఖాముఖి  రెండుసార్లు తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఆద్బుతంగా రాణిస్తుంది.

టీమిండియా : విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా,రవిచంద్రన్ అశ్విన్.

అఫ్గానిస్థాన్‌ : మహమ్మద్ నబీ (కెప్టెన్‌), హజ్రతుల్లా జజాయ్‌, షహజాద్, రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, గుల్బదిన్ నాయబ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్-హక్, హమీద్ హసన్‌, షరాఫుద్దీన్ అష్రఫ్

చదవండిBabar Azam: దుమ్ములేపిన బాబర్‌ ఆజం.. వనిందు హసరంగా తొలిసారిగా

మరిన్ని వార్తలు