T20 World Cup 2021 Ind Vs Pak: కచ్చితంగా టీమిండియాదే విజయం: గంభీర్‌

24 Oct, 2021 10:45 IST|Sakshi

Gautam Gambhir Comments About Team India: ‘‘టీమిండియాకు నా బెస్ట్‌ విషెస్‌. ఇప్పటి వరకు మన వాళ్లు ఎంతో బాగా ఆడారు. ఇప్పుడు కూడా తప్పకుండా గెలుస్తారు. వాళ్లపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మన జట్టు అత్యద్భుతంగా ఉంది. ఏ విషయాలు కూడా వారి ప్రదర్శనను ప్రభావితం చేయలేవు. మన జట్టు కచ్చితంగా బాగా ఆడుతుంది. తప్పక గెలిచి తీరుతుంది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతం గంభీర్‌ వ్యాఖ్యానించారు. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌పై భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా... నేడు(అక్టోబరు 24న) చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్‌ ముఖాముఖి తలపడనున్నాయి. దాయాదుల పోరు కోసం ఇరు దేశాల ప్రజలతో పాటు యావత్‌ క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పాకిస్తాన్‌తో జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ భారత జట్టే విజయం సాధించింది. 5-0 తేడాతో ముందంజలో ఉంది.

ఈ నేపథ్యంలో గంభీర్‌ టైమ్స్‌ నౌతో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ పరిస్థితి ఎప్పుడూ ఇంతే. భారత్‌ గనుక కచ్చితంగా తమ శక్తి సామర్థ్యాలు ఒడ్డి మునుపటి లాగే ఆడినట్లయితే విజయం నల్లేరు మీద నడకే. ప్రపంచంలోని ఏ జట్టుపైనైనా గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. ఈ పోరులో విజయం మనదే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటేనే భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అభిమానులు తమ తమ జట్లు విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

చదవండి: T20 World Cup Ind Vs Pak: అతడిని ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడించగలం: విరాట్‌ కోహ్లి
Babar Azam: మా బ్యాటింగ్‌ చాలా పటిష్టంగా ఉంది.. ఇమ్రాన్‌తో మాట్లాడాము

మరిన్ని వార్తలు