టి20 ప్రపంచకప్‌ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్‌

1 Nov, 2021 22:10 IST|Sakshi

Jos Buttler Maiden T20I Century.. టి20 ప్రపంచకప్‌ 2021లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ మెరుపు శతకంతో మెరిశాడు.  67 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో లంక బౌలర్లను ఊచకోత కోసిన బట్లర్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టడం ద్వారా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా బట్లర్‌కు టి20ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేగాక ఈ ప్రపంచకప్‌లో  బట్లర్‌దే తొలి సెంచరీ. అంతకముందు బట్లర్‌ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేనకు మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

ఇక ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌ల్లో 8 సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా బట్లర్‌ సెంచరీతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌(2007, 2016 టి20 ప్రపంచకప్‌లు), సురేశ్‌ రైనా(2010 టి20 ప్రపంచకప్‌), మహేళ జయవర్దనే(2010 టి20 ప్రపంచకప్‌), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(2012 టి20 ప్రపంచకప్‌), అలెక్స్‌ హేల్స్‌(2014 టి20 ప్రపంచకప్‌), అహ్మద్‌ షెహజాద్‌(2014 టి20 ప్రపంచకప్‌), తమీబ్‌ ఇక్బాల్‌(2016 టి20 ప్రపంచకప్‌) ఉన్నారు. తాజాగా జాస్‌ బట్లర్‌ వారి సరసన చేరాడు.

మరిన్ని వార్తలు