T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి

21 Oct, 2021 14:52 IST|Sakshi

IND Vs Pak T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా అక్టోబర్‌ 24న టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించి టికెట్స్‌ కూడా హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. టీమిండియా ఆడిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. బ్యాటింగ్‌ విభాగంలో ఓపెనింగ్‌ స్లాట్‌, వన్‌డౌన్‌ స్థానాలపై క్లారిటీ ఉన్నప్పటికీ నాలుగు, ఆరు, ఏడు స్థానాలపై మాత్రం సందిగ్థత నెలకొంది. ముందుగా అనుకున్న ప్రకారం ఓపెనింగ్‌ స్లాట్‌లో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు బరిలోకి దిగుతారు. ఇక మూడో స్థానంలో విరాట్‌ కోహ్లి ఉంటాడు.

చదవండి: T20 World Cup Ind vs Pak: ఎల్లప్పుడూ మనదే విజయం.. ఈసారి కూడా!

అయితే కీలకమైన నాలుగో స్థానానికి ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.. వారే సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లు. వాస్తవానికి ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌ ఆరంభంలో ఈ ఇద్దరు ఫామ్‌ కోల్పోవడంతో జట్టులో మార్పులు ఉంటాయని అంతా భావించారు. కానీ సీజన్‌ ఆఖర్లో ఈ ఇద్దరు ఫామ్‌లోకి రావడం.. అందునా ఇషాన్‌ కిషన్‌ వరుస హాఫ్‌ సెంచరీలతో దుమ్మురేపాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ అర్థసెంచరీతో దుమ్మురేపాడు. ఇక సూర్యకుమార్‌ ఆసీస్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే కోహ్లికి పెద్ద తలనొప్పిగా మారింది. టీమిండియాకు పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అంటే చాలా కీలకం. ప్రపంచకప్‌ గెలవడం కన్నా ముందు పాకిస్తాన్‌ను ఓడించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికైతే ఇషాన్‌ కిషన్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

చదవండి: T20 WC 2021 IND Vs PAK: పఠాన్‌ టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవెన్‌.. అశ్విన్‌కు నో ప్లేస్‌

ఇక ఐదో స్థానంలో రిషబ్‌ పంత్‌ రాగా.. మళ్లీ ఆరోస్థానంలో మరో సమస్య ఉంది. ఆల్‌రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజాకు బ్యాటింగ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫినిషర్‌ స్థానంగా భావించే ఏడో స్థానంలో హార్దిక్‌ పాండ్యాకు అవకాశమిస్తారా లేదా చూడాలి. ఇక ఎనిమిదో స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ లేదా వరుణ్‌ చక్రవర్తిలో ఎవరు ఒకరు ఉంటారు. ఇక పేస్‌ విభాగంలో 9, 10,11 స్థానాల్లో భువనేశ్వర్‌, షమీ, బుమ్రాలు రానున్నారు.   

చదవండి: T20 WC 2021 IND Vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. అసలు సమరానికి ముందు మంచి బూస్టప్‌

మరిన్ని వార్తలు