T20 WC 2021: మెంటార్‌గా పని ప్రారంభించిన ధోని.. వీడియో వైరల్‌

21 Oct, 2021 17:18 IST|Sakshi

MS Dhoni Train Rishabh Pant: టి20 ప్రపం‍చకప్‌ 2021 దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఎంఎస్‌ ధోనిని మెంటార్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా ధోని మెంటార్‌గా తన పనిని ప్రారంభించినట్లు తాజా వీడియో ద్వారా తెలుస్తోంది. బుధవారం టీమిండియా ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి పాకిస్తాన్‌తో అసలు మ్యాచ్‌కు(అక్టోబర్‌ 24) ముందు మంచి ప్రాక్టీస్ పొందింది. అలా టీమిండియా మ్యాచ్‌ ఆడుతుండగానే రిషబ్‌ పంత్‌ తన గురువైన ధోని నుంచి విలువైన సలహాలు, సూచనలు పొందాడు. ఈ నేపథ్యంలో ధోని పంత్‌కు ఇచ్చిన ట్రెయినింగ్‌ డ్రిల్‌ వీడియోపై స్పందించాడు.

చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి

 

''యూఏఈలో పిచ్‌లో స్లోగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంత్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు వివిధ యాంగిల్స్‌లో బంతులు విసిరాను. మోచేతి కింది నుంచి బంతులు విసురుతుంటే.. పంత్‌ వాటిని అందుకొని స్టంపింగ్‌ చేశాడు. ఇలా చేస్తే స్పిన్నర్ల బౌలింగ్‌లో మరింత వేగంగా స్టంప్‌ అవుట్‌ చేసే అవకాశం పెరుగుతుంది.'' అంటూ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. 

చదవండి: T20 World Cup: నువ్వసలు ఏం చేస్తున్నావు బాబర్‌.. టీమిండియాను చూసి నేర్చుకోండి

ఇక 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పంత్‌ అనతికాలంలోనే టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ ప్రధాన వికెట్‌ కీపర్‌గా ఎదిగాడు. ధోని రిటైర్మెంట్‌ తర్వాత తన దూకుడైన బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌లోనూ సత్తా చాటుతూ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. టీమిండియా తరపున పంత్‌ 25 టెస్టుల్లో 1549 పరుగులు.. 18 వన్డేల్లో 529 పరుగులు.. 33 టి20ల్లో 512 పరుగులు సాధించాడు. 

మరిన్ని వార్తలు