T20 World Cup 2021: తొలిసారి మెగా ఈవెంట్‌కు నమీబియా.. జట్టు ఇదే!

10 Sep, 2021 17:09 IST|Sakshi

Namibia T20 World Cup 2021 squad: యూఏఈ వేదికగా వచ్చే నెల 17న ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు సదరన్‌ ఆఫ్రికా దేశం నమీబియా తమ జట్టును ప్రకటించింది. సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌కు ఇందులో చోటు కల్పించడం విశేషం. 2016లో దక్షిణాఫ్రికా తరఫున టీ20 వరల్డ్‌కప్‌ ఆడిన డేవిడ్‌.. తన తండ్రి స్వదేశమైన నమీబియా నుంచి ఈసారి ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. 

ఇక హెడ్‌ కోచ్‌ పియరీ డీ బ్రున్‌ శిక్షణలో రాటుదేలిన తమ ఆటగాళ్లతో తొలిసారిగా ఈ మెగా ఈవెంట్‌లో తలపడేందుకు నమీబియా సిద్ధమవుతోంది. మేనేజ్‌మెంట్‌లో ప్రొటిస్‌ మాజీ ఆటగాడు మోర్నే మోర్కెల్‌ కూడా ఉండటం మరో విశేషం. కాగా 2019లో దుబాయ్‌లో జరిగిన క్వాలిఫైయర్‌ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం ద్వారా వరల్డ్‌కప్‌నకు నమీబియా అర్హత సాధించింది. ఇక అక్టోబరు 18న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

నమీబియా టీ20 జట్టు ఇదే..
గెర్హాడ్‌ ఎరాస్‌మస్‌(కెప్టెన్‌), స్టీఫెన్‌ బార్డ్‌, కార్ల్‌ బిర్కెన్‌స్టాక్‌, మిచావు డు ప్రీజ్‌, జాన్‌ ఫ్రిలింక్‌, జానే గ్రీన్‌, జాన్‌ నికోల్‌ లోఫ్టీ ఈటన్‌, బెర్నార్డ్‌ షోల్ట్‌, బెన్‌ షికాంగో, జేజే స్మిత్‌, రూబెన్‌ ట్రంపెల్‌మాన్‌, మైకేల్‌వాన్‌ లింగన్‌, డేవిడ్‌ వీజ్‌, క్రెయిగ్‌ విలియమ్స్‌, పిక్కీ యా ఫ్రాన్స్‌.

చదవండి: T20 World Cup 2021: విండీస్‌ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు

మరిన్ని వార్తలు