T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు

22 Oct, 2021 19:47 IST|Sakshi

Namibia Enters Super 12 T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో నమీబియా చరిత్ర సృష్టించింది. ఆడుతున్న తొలి టి20 ప్రపంచకప్‌లోనే సూపర్‌ 12 దశకు అర్హత సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన నమీబియా అండర్‌డాగ్స్‌గా కనిపించింది. అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్‌కు షాక్‌ ఇస్తూ నమీబియా అద్బుత విజయాన్ని అందుకుంది. ఎలాగైనా సూపర్‌ 12 దశకు అర్హత సాధించాలని ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను కీలకంగా తీసుకుంది. తొలుత ఐర్లాండ్‌ను 125 పరుగులకే కట్టడి చేసిన నమీబియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో అదరగొట్టింది. కెప్టెన్‌ ఎరాస్మస్‌ 53 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. చివర్లో డేవిడ్‌ వీస్‌ తన మెరుపులతో అలరించాడు.

చదవండి: T20 WC 2021 IND Vs PAK: కెప్టెన్లుగా తొలి టి20 ప్రపంచకప్‌.. ఇద్దరూ ఇద్దరే

ఈ సందర్భంగా తాము సూపర్‌ 12కు అర్హత సాధించామని తెలియగానే ఆటగాళ్లు ఆనందలో మునిగిపోయారు. ముఖ్యంగా విన్నింగ్‌ షాట్‌ ఆడిన డేవిడ్‌ వీస్‌ మైదానంలో గట్టిగా అరవగానే.. నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న గెర్హాడ్‌ ఎరాస్మస్‌ మొకాళ్లపై కూర్చొని తన సంతోషాన్ని వ్యక్తం చేయగా.. వీస్‌ వచ్చి అతనికి హగ్‌ ఇచ్చాడు. ఇక డగౌట్‌లో ఉన్న నమీబియా ఆటగాళ్లు సంబరాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

చదవండి: T20 WC 2021 NAM Vs IRE: ఐర్లాండ్‌ ఓటమి.. నమీబియా సూపర్‌- 12కు

ఇక 2019లో నమీబియా టి20ల్లో అరంగేట్రం చేసింది. ఒక టి20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12కు అర్హత సాధించేందుకు నమీబియాకు 25 మ్యాచ్‌లు మాత్రమే అవసరమయ్యాయి. ఇక 1993లో ఐసీసీలో అసోసియేట్‌ మెంబర్‌గా సభ్యత్వం పొందిన నమీబియా తొలిసారి 2003 ప్రపంచకప్‌లో పాల్గొంది.

చదవండి: T20 WC 2021: తృటిలో తప్పించుకున్న పపువా; టి 20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యల్ప స్కోర్లు 

మరిన్ని వార్తలు