T20 WC 2021 OMAN Vs SCO: ఒమన్‌పై స్కాట్లాండ్‌ ఘన విజయం.. గ్రూప్‌ బీ టాపర్‌గా సూపర్‌ 12కు అర్హత

21 Oct, 2021 22:52 IST|Sakshi

ఒమన్‌పై స్కాట్లాండ్‌ ఘన విజయం.. గ్రూప్‌ బీ టాపర్‌గా సూపర్‌ 12కు అర్హత
ఒమన్‌ నిర్ధేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌ సునాయాస విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసి, గ్రూప్‌ బీ టాపర్‌గా సూపర్‌ 12కు అర్హత సాధించింది. కెప్టెన్‌ కైల్‌ కొయెట్జర్‌(28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు మున్సే(19 బంతుల్లో 20; 4 ఫోర్లు), మాథ్యూ క్రాస్‌(35 బంతుల్లో 26 నాటౌట్‌ ), రిచీ బెర్రింగ్టన్‌(21 బంతుల్లో 31 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించారు. ఒమన్‌ బౌలర్లలో ఫయాజ్‌ బట్‌, ఖవర్‌ అలీ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ విజయంతో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన స్కాట్లాండ్‌.. సూపర్‌ 12లో భారత్‌ ఉండే గ్రూప్‌(గ్రూప్‌ 2)లో చేరింది. జోష్‌ డేవీకి ప్లేయర్‌ ఆప్‌ ద మ్యాచ్‌ అవార్డుయ లభించింది. 

లక్ష్యం దిశగా సాగుతున్న స్కాట్లాండ్‌ 
ఒమన్‌ నిర్ధేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్‌ జట్టు నిలకడగా బ్యాటింగ్‌ చేస్తుంది. 8 ఓవర్ల తర్వాత మున్సే(19 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్‌ నష్టపోయి 63 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది. క్రీజ్‌లో కైల్‌ కొయెట్జర్‌(22 బంతుల్లో 33), మాథ్యూ క్రాస్‌(6) ఉన్నారు. మున్సే వికెట్‌ ఫయాజ్‌ బట్‌కు దక్కింది.  

ఒమన్‌ 122 ఆలౌట్‌.. స్కాట్లాండ్‌ టార్గెట్‌ 123
స్కాట్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఒమన్‌ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో కేవలం 122 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఆకిబ్‌ ఇలియాస్‌(37), మహ్మద్‌ నదీమ్‌(25), కెప్టెన్‌ జీషన్‌ మక్సూద్‌(34) మాత్రమే రెండంకెల స్కోర్‌ సాధించారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో జోష్‌ డేవీ 3 వికెట్లతో చెలరేగగా.. సాఫ్యాన్‌ షరీఫ్‌, మైఖేల్‌ లీస్క్‌ చెరో 2 వికెట్లు.. మార్క్‌ వాట్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.  

94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఒమన్‌
స్కాట్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఒమన్‌ జట్టు 15 ఓవర్లలో 94 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. స్కాట్లాండ్‌ బౌలర్లు సాఫ్యాన్‌ షరీఫ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. మైఖేల్‌ లీస్క్‌, మార్క్‌ వాట్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. క్రీజ్‌లో కెప్టెన్‌ జీషన్‌ మక్సూద్‌(19), నసీం ఖుషి(1) ఉన్నారు. 

5 ఓవర్ల తర్వాత ఒమన్‌ స్కోర్‌ 31/2
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్‌.. ఇన్నింగ్స్‌ రెండో బంతికే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌ జతిందర్‌ సింగ్‌(0) రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్‌లో ఆ జట్టు మరో వికెట్‌ కోల్పోయింది. సాఫ్యాన్‌ షరీఫ్‌ బౌలింగ్‌లో మున్సేకు క్యాచ్‌ ఇచ్చి కశ్యప్‌ ప్రజాపతి(8 బంతుల్లో 3) వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత ఒమన్‌ స్కోర్‌ 31/2. క్రీజ్‌లో ఆకిబ్‌ ఇలియాస్‌(18 బంతుల్లో 23; ఫోర్‌, 2 సిక్సర్లు), మహ్మద్‌ నదీమ్‌(3) ఉన్నారు.

అల్‌ అమీరట్‌: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా గురువారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్‌-బీ మ్యాచ్‌లో ఒమన్‌, స్కాట్లాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఒమన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు: 
ఒమన్‌: జతిందర్‌ సింగ్‌, ఆకిబ్‌ ఇలియాస్‌, కశ్యప్‌ ప్రజాపతి, జీషన్‌ మక్సూద్‌(కెప్టెన్‌), ఖవర్‌ అలీ, నసీం ఖుషి(వికెట్‌ కీపర్‌), సూరజ్‌ కుమార్‌, మహ్మద్‌ నదీం, సందీప్‌ గౌడ్‌, బిలాల్‌ ఖాన్‌, ఫయాజ్‌ బట్‌

స్కాట్లాండ్‌: జార్జ్ మున్సే, కైల్ కోట్జెర్ (కెప్టెన్‌), మాథ్యూ క్రాస్ (వికెట్‌ కీపర్‌), రిచీ బెర్రింగ్టన్, కాలమ్ మాక్లీడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవి, బ్రాడ్లీ వీల్, సాఫ్యాన్‌ షరీఫ్‌

మరిన్ని వార్తలు