PAK Vs NAM: 'ఓడిపోయామని బాధపడకండి.. బాగా ఆడారు'

3 Nov, 2021 11:18 IST|Sakshi

Pakistan Win Hearts Visiting Namibia Dressing Room After Win Match.. టి20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్‌ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్‌ ఐదోసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌..  ఓపెనర్లు బాబర్‌ అజమ్‌(70), మహ్మద్‌ రిజ్వాన్‌(79 నాటౌట్‌) వీరవిహారంతో 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పాకిస్తాన్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొని నమీబియా ఆడిన తీరును క్రికెట్‌ అభిమానులు ప్రశంసించారు.

చదవండి: T20 WC 2021 PAK Vs NAM: దుమ్మురేపిన ఓపెనర్లు.. ఐదోసారి సెమీస్‌కు పాకిస్తాన్‌

తాజాగా పాకిస్తాన్‌ జట్టు కూడా మ్యాచ్‌ ముగిసిన అనంతరం బాధలో ఉన్న నమీబియాను వారి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఓదార్చి క్రీడాస్పూర్తి ప్రదర్శించి అభిమానుల మనసు గెలుచుకున్నారు. సెలక్షన్‌ మేనేజర్‌ సహా మహ్మద్‌ హపీజ్‌, హసన్‌ అలీ, షాహిన్‌ అఫ్రిది, షాబాద్‌ ఖాన్‌, ఫఖర్‌ జమాన్‌లు కలిసి నమీబియా డ్రెస్సింగ్‌రూమ్‌కు వచ్చి వారిని అభినందించారు. '' మ్యాచ్‌లో ఓడిపోయామని బాధపడకండి.. చాలా మంచి ప్రదర్శన ఇచ్చారు. మాకు పోటీగా పరుగులు సాధిస్తూ మమ్మల్ని కాసేపు ఆందోళన పడేలా చేశారు. అయితే మ్యాచ్‌లో గెలుపోటములు సహజం. మ్యాచ్‌లో డేవిడ్‌ వీస్‌ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మిగతా మ్యాచ్‌ల్లో గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.. ఆల్‌ ది బెస్ట్‌'' అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం పాక్‌ క్రికెటర్లు నమీబియా క్రికెటర్లను హగ్‌ చేసుకొని అభినందించారు.

చదవండి: IND VS NZ: వార్నీ ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి?!

కాగా ఈ వీడియోనూ పీసీబీ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక పాకిస్తాన్‌ క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన తీరుకు క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ''ఓడిన జట్టు బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పడం ధర్మం.. ఈరోజు పాకిస్తాన్‌ దానిని చేసి చూపించింది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు