SA Vs SL: డికాక్‌ మోకాళ్లపై నిల్చున్నాడు.. ఇప్పుడైనా వదిలేయండి

30 Oct, 2021 16:52 IST|Sakshi

Quinton De Kock Bend Knee Black Live Matters Moment.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌​క్వింటన్‌ డికాక్‌ శ్రీలంకతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అతను బరిలో ఉన్నాడనే దానికంటే బ్లాక్‌లైవ్‌ మ్యాటర్స్‌ ఉద్యమానికి మద్దతిస్తాడా లేదా అన్నదానిపై చాలా మందిలో ఆసక్తి నెలకొని ఉంది. కాగా డికాక్‌ ఈసారి మాత్రం బ్లాక్‌లైవ్స్‌ మ్యాటర్స్‌కు ఉద్యమానికి మద్దతిస్తూ మోకాళ్లపై నిల్చొని సంఘీభావం తెలిపాడు. దీంతో అతని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తుంటే.. గిట్టనివాళ్లు మాత్రం డికాక్‌పై ట్రోల్స్‌ ఆపలేదు. అయితే తన తప్పు తెలుసుకొని డికాక్‌ సంఘీబావం తెలిపాడు.. ఇకనైనా అతన్ని వదిలేయండి అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: మోకాలిపై నిలబడకపోవడంపై క్షమాపణలు కోరిన డికాక్‌

ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు బ్లాక్‌లైవ్‌ మ్యాటర్స్‌​ మూమెంట్‌కు మద్దతు ఇవ్వలేనంటూ ఆఖరి క్షణంలో జట్టు నుంచి తప్పుకొని అందర్ని ఆశ్చర్యపరిచాడు. అయితే డికాక్‌ తీరుపై సీఎస్‌ఏతో(క్రికెట్‌ సౌతాఫ్రికా అసోసియేషన్‌) పాటు అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో డికాక్‌ దక్షిణాఫ్రికాకు ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడంటూ ఊహగానాలు కూడా వచ్చాయి. కానీ సీఎస్‌ఏ అవన్నీ కొట్టి పారేసింది.. మద్దతివ్వాలా వద్దా అనేది అతనిష్టం. కానీ మా ఆదేశాలు దిక్కరించినందుకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్లారిటి ఉంది. సీఎస్‌ఏ చర్యలు తీసుకునేలోపే డికాక్‌ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతూ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్‌ ఔట్‌.. కారణం 

మరిన్ని వార్తలు