Rashid Khan: టి20 క్రికెట్‌లో రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత

29 Oct, 2021 23:11 IST|Sakshi

Rashid Khan Takes 100 Wickets In T20 Cricket.. టి20 క్రికెట్‌లో రషీద్‌ ఖాన్‌ 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ ఈ ఘనత సాధించాడు. పాక్‌ బ్యాటర్‌ మహ్మద్‌ హఫీజ్‌ను ఔట్‌ చేయడం ద్వారా రషీద్‌ 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రషీద్‌ చరిత్ర సృష్టించాడు.  ఈ ఫీట్‌ అందుకోవడానికి రషీద్‌ 53 మ్యాచ్‌లు తీసుకున్నాడు.

చదవండి: BAN Vs WI: డిపెండింగ్‌ చాంపియన్‌ ఆటతీరు.. వెస్టిండీస్‌కు అలవాటే

కాగా టి20 క్రికెట్‌ చరిత్రలో 100 వికెట్ల మార్క్‌ను చేరుకున్న నాలుగో ఆటగాడిగా రషీద్‌ నిలిచాడు. ఇంతకముందు షకీబ్‌ అల్‌ హసన్‌(117 వికెట్లు, బంగ్లాదేశ్‌), లసిత్‌ మలింగ(107 వికెట్లు, శ్రీలంక), టిమ్‌ సౌథీ(100 వికెట్లు, న్యూజిలాండ్‌) ఉన్నారు.

చదవండి: T20 WC 2021 PAK Vs AFG:ఆసిఫ్‌ అలీ సిక్సర్ల వర్షం.. పాక్‌ హ్యట్రిక్‌ విజయం

మరిన్ని వార్తలు