T20 WC 2021: దక్షిణాఫ్రికాకు ఇది నాలుగోసారి

23 Oct, 2021 18:27 IST|Sakshi

South Africa Lowest Totals In T20 WC.. టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా నాలుగోసారి అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఇంతకముందు 2007టి 20 ప్రపంచకప్‌లో ఇండియాపై 116, 2009 టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 122, 2009 టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై 128 పరుగులు చేసింది. 

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్‌ బౌలర్ల దాటికి మక్రమ్‌(40) మినహా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌ తలా రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆడుతున్న ఆసీస్‌ 12 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. స్మిత్‌ 25, మ్యాక్స్‌వెల్‌ 8 పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: T20 WC 2021 AUS Vs SA: అయ్యో కేశవ్‌ ఎంత పనైంది.. రనౌట్‌ చూసి తీరాల్సిందే

T20 Worldcup 2021: భారత్‌తో తలపడే జట్టును ప్రకటించిన పాక్‌..

>
మరిన్ని వార్తలు