IND Vs NZ: ఇదేం ప్రాక్టీస్‌.. కిందపడిన ఇషాన్‌; అశ్విన్‌ మాత్రమే

31 Oct, 2021 16:53 IST|Sakshi

Team India Fielding Drill Vs NZ.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా నేడు కివీస్‌తో కీలకమ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. క్వార్టర్‌ ఫైనల్‌గా భావిస్తున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని ఫ్యాన్స్‌ గట్టిగానే కోరుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్‌ మొదలవన్నున్న నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్‌ డ్రిల్‌ వీడియో ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్‌లో కొన్ని లోపాలు బయటపడ్డాయి. కివీస్‌తో మ్యాచ్‌లో ఆ తప్పులు చేయకూడదనే ఉద్దేశంతో టీమిండియా ఫీల్డింగ్‌ విభాగం ఆటగాళ్లకు కొత్త రకం డ్రిల్‌ ఏర్పాటు చేశారు.

చదవండి: కోహ్లిని వెంటాడుతున్న ఆ చెత్త రికార్డు.. సోధి మళ్లీ మెరుస్తాడా!

ఎవరో ఒకరు టెన్నిస్‌ రాకెట్‌తో బంతిని గాల్లోకి కొడతారు.. అందులో మరొక ఆటగాడు హెల్మెట్‌ పెట్టుకొని బంతి కిందకు వస్తున్న దశలో దానిని హెల్మెట్‌తో కొట్టాలి. అలా కొట్టిన బంతిని ఆటగాళ్లు కేవలం తమ ఎడమ చేతితో మాత్రమే అందుకోవాలి. డ్రిల్‌ కాస్త చాలెంజింగ్‌గా ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు బంతులను అందుకోవడంలో విఫలమయ్యారు. ఇషాన్‌ కిషన్‌ బంతిని అందుకోబోయి విఫలమై కిందపడ్డాడు. కేవలం ఒక్క అశ్విన్‌ మాత్రమే టాస్క్‌ను కంప్లీట్‌ చేయగలిగాడు. కాగా ఐసీసీ ఈ వీడియోనూ షేర్‌ చేస్తూ..  ట్రెయినింగ్‌ డ్రిల్‌కు ఒక పేరు ఇవ్వండి అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

చదవండి: IND Vs NZ: భువనేశ్వర్‌ను తీసేయండి.. అతడిని తీసుకోండి

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు