Virat Kohli: సండే బిగ్‌ మ్యాచ్‌.. మీరు ఒత్తిడిలో? మరి నా పరిస్థితి!

21 Oct, 2021 15:49 IST|Sakshi

Virat Kohli Tweet Viral IND Vs PAK T20 WC.. టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఎవరికి ఉత్కంఠ ఉండదు చెప్పండి. ఈ ఆదివారం(అక్టోబర్‌ 24) ఇండియా-పాక్‌ మధ్య బిగ్‌ఫైట్‌ జరగనుంది. ఇప్పటికే ఈ ఆదివారం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎటువంటి పనులు పెట్టుకోకుండా మ్యాచ్‌ చూసేందుకు సిద్దమవుతున్నారు. మరి అలాంటి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే ఊరుకుంటారా.. ఇప్పటికైతే టీమిండియా ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి.. ఆరోజు ఏం జరిగేది ఎవరు చెప్పలేరు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిమానులనుద్దేశించి ఒక ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. వైట్‌ టీషర్ట్‌ వేసుకున్న కోహ్లి.. '' సండే బిగ్‌మ్యాచ్‌ ఉంది కదా( ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌).. మీరు ఒత్తిడికి గురవుతున్నారనిపిస్తుంది.. మరి నా పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. 

చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి

ఇక విరాట్‌ కోహ్లికి టి20 కెప్టెన్‌గా ఇదే చివరి ప్రపంచకప్‌. మెగా టోర్నీ అనంతరం కోహ్లి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న కోహ్లికి టి20 ప్రపంచకప్‌ను గిఫ్ట్‌గా అందించాలని టీమిండియా  ఆటగాళ్లు భావిస్తున్నారు.

చదవండి: IND Vs AUS: రెస్ట్‌ అన్నారు.. బౌలింగ్‌తో సర్‌ప్రైజ్‌

T20 World Cup: సెమీస్‌ చేరేది ఆ 4 జట్లే: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు