T20 World Cup 2021: టైటిల్‌ రేసులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఎవరి బలం ఎంతంటే?

13 Nov, 2021 22:46 IST|Sakshi

Final Australia vs New Zealand Match Prediction : టీ20 ప్రపంచకప్‌-2021 తుది ఘట్టానికి చేరుకుంది.  ఆదివారం(నవంబర్‌14) దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా తుది పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లుఅమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ అనుహ్య విజయం సాధించింది. మరో వైపు రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై అద్బుత విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే ఈ రెండు జట్లలో ఏది విజయం సాధించిన.. ఈసారి ట్రోఫిని కొత్త జట్టు ముద్దాడబోతోంది. కాగా ఈ రెండు జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. దీంతో టైటిల్‌ ఫేవరేట్‌ ఏ జట్టు అనేది అంచనా వేయడం కష్టమే. కాగా ఇరు జట్ల బలాబలాలు చూస్తే.. ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. ఓపెనర్‌లు డేవిడ్‌ వార్నర్‌, ఫించ్‌ ఆద్బుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసిశ్చో అంశం. ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న మిచెల్‌ మార్ష్‌ కూడా  ఆద్బుతంగా రాణిస్తున్నాడు. ఇక 'మిడిలార్డర్‌లో స్టొయినిస్, వేడ్‌ల రూపంలో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేవేయగల హిట్టర్లు ఉన్నారు. అయితే  స్టార్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కలవర పెడుతున్నది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. స్టార్క్‌, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ వంటి స్టార్‌  ఫాస్ట్‌ బౌలర్లు ఈ జట్టులో ఉన్నారు. మరో వైపు స్పిన్నర్‌ అడమ్ జంపా ఆద్బుతంగా రాణిస్తున్నాడు. ఇక న్యూజిలాండ్‌ విషయానికి వస్తే.. ఈ జట్టు కూడా బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది.

అయితే ఈ కీలక పోరుకు ముందు స్టార్‌ బ్యాటర్‌ కాన్వే దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాగా ఆ జట్టులో ఓపెనర్లు  మార్టిన్‌ గుప్టిల్‌, డారిల్ మిచెల్ ఈ టోర్నమెంట్‌లో ఆద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆజట్టు కెప్టెన్‌  కేన్ విలియమ్సన్ కూడా తనదైన రోజున చెలరేగి ఆడగలడు. మిడిలార్డర్‌లో  గ్లెన్ ఫిలిప్స్‌, నీషమ్‌ వంటి హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే..  టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ స్పెషలిస్ట్ టీ20 బౌలర్లతో పటిష్టంగా ఉంది. కాగా టీ20ల్లో 14 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ముఖా ముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్‌ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.  టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పైచేయి సాధించింది.

చదవండిMatthew Wade: క్యాన్సర్‌ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు...

మరిన్ని వార్తలు