T20 World Cup 2022: వెస్టిండీస్‌కు బిగ్‌ షాకిచ్చిన స్కా‍ట్లాండ్‌

17 Oct, 2022 10:16 IST|Sakshi

వెస్టిండీస్‌కు బిగ్‌ షాకిచ్చిన స్కా‍ట్లాండ్‌
టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌ ‘బి’ తొలి రౌండ్‌ (క్వాలిఫయర్స్‌) మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను స్కాట్లాండ్‌ చిత్తు చేసింది. హోబార్ట్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 118 పరుగులకే కుప్పకూలింది.

ఓటమికి చేరువలో విండీస్‌
హోబార్ట్‌ వేదికగా స్కాట్లాండ్‌తో  జరుగుతోన్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓటమికి చేరువైంది. 15 ఓవర్లు ముగిసే సరికి విండీస్‌ 8 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.

69 పరుగులకే ఐదు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో విండీస్‌
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు స్కాట్లాండ్‌ బౌలర్లలో లీసక్‌ రెండు వికెట్లు, వాట్‌, వీల్‌, డేవీ తలా వికెట్‌ సాధించారు. 11 ఓవర్లకు విండీస్‌ స్కోర్‌: 72/5

చెలరేగిన మున్సీ.. వెస్టిండీస్‌ టార్గెట్‌ 161 పరుగులు
తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ మున్సీ(53 బంతుల్లో 66 నటౌట్‌) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో హోల్డర్‌, జోసఫ్‌ చెరో రెండు వికెట్లు సాధించగా.. స్మిత్‌ ఒక్క వికెట్‌ సాధించాడు.

16 ఓవర్లకు స్కాట్లండ్‌ స్కోర్‌: 122/4
16 ఓవర్లు ముగిసే సరికి స్కాట్లాండ్‌ నాలుగు  వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. క్రీజులో మున్సీ(49), లీసక్‌(3) పరుగులతో ఉన్నారు.

14 ఓవర్లకు స్కాట్లాండ్‌ స్కోర్‌: 107/3
14 ఓవర్లు ముగిసే సరికి స్కాట్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో మున్సీ(45), కాలమ్ మాక్లియోడ్(16) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన స్కాట్లాండ్‌
55 పరుగుల వద్ద స్కాట్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన మైఖేల్ జోన్స్..  హోల్డర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

మ్యాచ్‌కు వర్షం అంతరాయం
టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ ‘బి’ తొలి రౌండ్‌ (క్వాలిఫయర్స్‌)లో వెస్టిండీస్‌తో స్కాట్లాండ్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఇక తొలుత  బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌  5.3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. కాగా స్కాట్లాండ్‌  ఇన్నింగ్స్‌ 5.3 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
చదవండిKL Rahul: అర్థశతకంతో చెలరేగిన కేఎల్‌ రాహుల్‌

మరిన్ని వార్తలు